BSNL best plans with long validity and unlimited benefits compared to jio airtel and vi
BSNL: ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచిన తర్వాత పెరిగిన రేట్లు దెబ్బకి యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, బిఎస్ఎన్ఎల్ యూజర్లు మాత్రం చాలా చవక ధరకే అన్లిమిటెడ్ లాభాలను అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుకుంటున్న ఆనందాన్ని చూస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, ఈరోజు జియో, ఎయిర్టెల్ మరియు Vi ప్రైవేట్ టెలికాం కంపెనీలు పోటీ పడలేని బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్స్ ఏమిటో చూద్దాం.
బిఎస్ఎన్ఎల్ యూజర్లకు చాలా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. చాలా చవక ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలను అందించే ప్లాన్స్ కూడా ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ రూ. 797 మరియు రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ లను వాటిలో బెస్ట్ బడ్జెట్ ప్లాన్ లుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ రెండు ప్లాన్స్ కూడా అధిక వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి.
Also Read: LG UHD AI స్మార్ట్ టీవీ పైన అమెజాన్ బెస్ట్ డీల్స్ అందుకోండి.!
ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక రేటుకే 45 రోజుల అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 45 వ్యాలిడిటీ తో వస్తుంది మరియు ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2GB డేటా తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అంటే, ఈ బిఎస్ఎన్ఎల్ కేవలం రూ. 249 రూపాయల ఖర్చులోనే 45 రోజుల పాటు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS లాభాలను అందిస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ అందించే ప్లాన్ గా ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ టోటల్ 300 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, 60 రోజులు ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. అవేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అయితే, డేటా మరియు కాలింగ్ లాభాలను 60 రోజుల వరకు మాత్రమే అందిస్తుంది. అయితే, ఇది 300 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది.
మీ మొబైల్ నెంబర్ ను రీఛార్జ్ చేయడానికి Click Here