BSNL తక్కువ ధరలో ఆఫర్ చేస్తున్న బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేద్దామా.!

Updated on 08-Feb-2025
HIGHLIGHTS

BSNL యూజర్ల కోసం చాలా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది

ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి

రూ. 250 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్

BSNL యూజర్ల కోసం చాలా గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. అందులోనే రెండు బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కేవలం రూ. 250 రూపాయల కంటే తక్కువ ధరలోనే కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఈరోజు ఈ రెండు బెస్ట్ బడ్జెట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దాం.

ఏమిటా BSNL బెస్ట్ ప్లాన్స్?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 199 మరియు రూ. 249 రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా రూ. 250 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ గా చెప్పబడతాయి. ఈ రెండు ప్లాన్స్ ఆఫర్ చేసే పూర్తి లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. దీనితో పాటు ఈ ప్లాన్ తో డైలీ 2GB హై డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా ఆఫర్ చేస్తుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందిస్తుంది. ఈ ప్లాన్ తో 45 రోజులు డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS లిమిట్ ను కూడా పొందుతారు.

Also Read: LG Dolby Soundbar పై అమెజాన్ జబర్దస్త్ ఆఫర్..12 వేలకే లభిస్తున్న పవర్ ఫుల్ సౌండ్ బార్.!

ఈ రెండు ప్లాన్స్ కూడా డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా సౌలభ్యాన్ని అందిస్తాయి.

మరిన్ని బెస్ట్ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ చెక్ చేయడానికి Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :