BSNL రూ. 199 మరియు రూ.499 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

HIGHLIGHTS

ఉచిత క్రికెట్ PRBT (పెర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) ని కూడా ఈ ప్రీపెయిడ్ ప్లానుతో అందిస్తోంది.

BSNL రూ. 199 మరియు రూ.499  కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), క్రికెట్ అభిమానుల కోసం  IPL 2019 సందర్భంగా రెండు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజు వారి డేటాతో పాటుగా ఇన్స్టాంట్ అప్డేట్స్ యొక్క వివరాలను SMS ద్వారా వినియోగదారులు అందుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను రూ.199 మరియు రూ.499 ధరతో ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ రూ.199 ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ కాలింగ్ అఫర్ చేస్తోంది. ఢిల్లీ మరియు ముంబాయి సర్కిళ్లలో మాత్రం కాలింగ్ చేసుకుం అవకాశం ఉండదు. అలాగే,  ప్లానుతో రోజు వారి 1GB డేటాని వినియోగదారులు అందుకుంటారు.  ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ విషయానికి వస్తే, ఇది 28 రోజుల వ్యాలిడితో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా అందుకుంటారు. అధనంగా, ఉచిత క్రికెట్ PRBT (పెర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) ని కూడా ఈ ప్రీపెయిడ్ ప్లానుతో అందిస్తోంది.

ఇక ఈ రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, దీనితో అపరిమిత కాలింగ్ అందుకుంటారు వినియోగదారులు.  అలాగే, ఈ ప్లానుతో రోజు వారి 1GB డేటాని వినియోగదారులు అందుకుంటారు.  ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ విషయానికి వస్తే, ఇది 90 రోజుల వ్యాలిడితో వస్తుంది. అంటే, 90 రోజులకు గాను 90GB ల డేటాని పొందుతారు మరియు రోజుకు ఉచిత 100SMS లను కూడా ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అందుకుంటారు. అధనంగా, ఉచిత క్రికెట్ PRBT (పెర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్) ని కూడా ఈ ప్రీపెయిడ్ ప్లానుతో అందిస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo