bsnl announced new instant discount offer on recharge
BSNL యూజర్ల కోసం ప్రభుత్వ టెలికాం కొత్త రీఛార్జ్ కొట్టు డిస్కౌంట్ పట్టు ఆఫర్ తెచ్చింది. ఆఫ్ కోర్స్, ఈ ఆఫర్ పేరు ఇది కాదనుకోండి, కానీ ఈ ఆఫర్ విధానం మాత్రమే అదే అవుతుంది. అదేమిటంటే, దీపావళి పండుగ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన చాలా ఆఫర్స్ లో ఇది ఒకటి. ఈ ఆఫర్స్ తో బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ రీఛార్జ్ చేసే యూజర్లకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
బీఎస్ఎన్ఎల్ అక్టోబర్ 18న ఈ ఆఫర్ ని అనౌన్స్ చేసింది మరియు ఈ ఆఫర్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మరియు యూజర్లకు ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ అందుకోవడానికి బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
అంటే, మీరు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా ఏ బీఎస్ఎన్ఎల్ యూజర్ కోసం రీఛార్జ్ చేసినా మీకు 2.5% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, రూ. 199 రూపాయల పై బడిన ప్లాన్ రీఛార్జ్ పై మాత్రమే ఈ అదనపు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఇది కాకుండా మరిన్ని అదనపు ప్రయోజనాలు అందించే మరిన్ని ప్లాన్స్ కూడా అందించింది. ఇందులో సీనియర్ సిటిజన్ కోసం అందించిన ఆఫర్ కూడా ఒకటి ఉంది. అదే బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ ను కేవలం రూ. 1,812 రూపాయల ఆఫర్ ధరకే అందించింది. ఈ చవక ప్రీపెయిడ్ ప్లాన్ సీనియర్ సిటిజన్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.
Also Read: iQOO 15 ఇండియా లాంచ్ మరియు ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఐకూ.!
బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజుల వ్యాలిడిటీ ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే సీనియర్ సిటిజన్స్ కి సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు 6 నెలల BiTV సబ్ స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.
అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందుకోవడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఈ ఆఫర్ ప్లాన్ అందుకోవాలంటే కొత్త సిమ్ కార్డు తీసుకునే సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ప్లాన్ మరియు కేవలం అక్టోబర్ 18 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో రీఛార్జ్ చేసే కొత్త సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది.