BSNL భారీ డేటా అఫర్: డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

HIGHLIGHTS

BSNL యొక్క Rs.78 కొత్త ప్లాన్ రోజుకు 3GB డేటాను అందిస్తుంది.

ఈ కొత్త Rs .78 ప్లాన్ తో, వినియోగదారులకు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత అపరిమిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది.

ఈ ప్లాన్ Eros Now ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ కు కంపెనీ ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది.

BSNL భారీ డేటా అఫర్:  డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్

BSNL ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్రణాళికలతో, తన వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్న సంస్థగా ముందుకు సాగుతోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌, ప్రతిరోజూ కూడా  కొత్త ప్లాన్లను యూజర్ల కోసం తీసుకొస్తూనేవుంది. అయితే, BSNL ఇప్పుడు ఇతర టెలికాం కంపెనీలతో గట్టి పోటీ ఇవ్వడానికి మరో గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ రూ.78 ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. మీరు ఎక్కువ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్స్ కోసం చూస్తున్నట్లయితే, ఈ బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ గురించి తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త ప్లాన్ రోజుకు 3GB  డేటాను అందిస్తుంది. ఇంత ఎక్కువ డేటా ఇస్తుందంటే దీని రేటు కూడా ఎక్కువే ఉంటుందని అనుకుంటున్నారా? కానీ, ఈ ప్లాన్ కేవలం 78 రూపాయలకే లభిస్తుంది.

BSNL Rs .78 ప్లాన్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ఈ కొత్త ప్రణాళికతో, వినియోగదారులకు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత అపరిమిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. అధనంగా, రోజుకు 3 జీబీ డేటా ఇంటర్నెట్ కూడా అందుతుంది. అంతేకాదు, Eros Now ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ కు కంపెనీ ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తుంది. BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు మాత్రం ఒకవారం మాత్రమే అంటే 7 రోజులు.

BSNL రూ. 365 ప్రీపెయిడ్ ప్లాన్

ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఇటీవల బిఎస్ఎన్ఎల్ రూ .365 ప్లాన్ను విడుదల చేసింది. బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 365 రూపాయలకు అపరిమిత లోకల్ మరియు నేషనల్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. రోజుకు 2GB డేటా కూడా ఈ ప్లానుతో లభిస్తుంది. ఈ డేటా పూర్తయిన తరువాత నెట్ స్పీడ్ 80kbps కి తగ్గుంచబడుతుంది. మరోవైపు, మీరు రోజుకు 100 SMS కూడా అందుకుంటారు. ఉచిత వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పిఆర్బిటి) కూడా ఉంది. కంపెనీ వినియోగదారులకు 365 రోజుల వ్యవధిని రూ .365 రూపాయలకే ఇస్తోంది.

బిఎస్ఎన్ఎల్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo