ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన Extra వ్యాలిడిటీ ఆఫర్ చేస్తున్న BSNL టెలికాం.!

HIGHLIGHTS

అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న BSNL

రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఎక్స్ ట్రా వ్యాలిడిటీ ఆఫర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఎక్కువ వ్యాలిడిటీ అందుతుంది

అతి తక్కువ ధరకే అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న టెలికాం కంపెనీగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందరి కంటే ముందుటుంది. చాలా సరసమైన ధరలకే యూజర్లకు ఎక్కువ ప్రయోజాలను అందిస్తాయి బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్. అయితే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తన యూజర్లకు మరొక శుభవార్త అనౌన్స్ చేసింది. బిఎస్ఎన్ఎల్ యొక్క రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఎక్స్ ట్రా వ్యాలిడిటీ ఆఫర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంటే, ఈ పాత ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఎక్కువ వ్యాలిడిటీ అందుతుంది.

BSNL కొత్త ఆఫర్ ఏమిటీ?

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ముందు నుండే ఆఫర్ చేస్తున్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన ఈ అదనపు వ్యాలిడిటీ ఆఫర్ ని జత చేసింది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.699 ప్లాన్ మరియు రూ. 999 ప్లాన్ ల పైన ఈ ప్రయోజనాన్ని జత చేసింది. పెరిగిన వ్యాలిడిటీ తరువాత ఈ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు.

Also Read: ఈరోజే విడుదలైన vivo T3 5G Top-5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!

బిఎస్ఎన్ఎల్ రూ. 699 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ PV699 ప్లాన్ ముందుగా కేవలం 130 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందించేది. కానీ, బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ పైన ఇప్పుడు 20 రోజులు ఎక్స్ ట్రా వాలిడిటీని జత చేయడంతో, ఈ ప్లాన్ ఇప్పుడు 150 రోజుల వ్యాలిడిటీని తీసుకు వస్తుంది.

BSNL PV699 Plan

ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను చూస్తే, ఈ ప్లాన్ 150 రోజులకు గాను అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 0.5 GB డేటా కూడా అందుతుంది. అలాగే, ఈ ప్లాన్ తో 100SMS రోజువారి వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 999 ప్లాన్

ఇక బిఎస్ఎన్ఎల్ యొక్క PV699 ప్లాన్ ను చూస్తే, ఈ ప్లాన్ తో కూడా 15 రోజుల అధనపు వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ ప్లాన్ ఇప్పుడు మొత్తం 215 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఇంతకూ ముందు ఈ ప్లాన్ తో 200 రోజుల చెల్లుబాటతో మాత్రమే వచ్చేది.

BSNL PV999 Plan

ఇక ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాల విషయానికొస్తే, ఈ ప్లాన్ 215 రోజులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డేటా మరియు SMS వంటి ఇతర ప్రయోజనాలు మాత్రం అందించబడవు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :