Blaupunkt launched three new QLED Smart Tvs with 120Hz refresh rate
జర్మనీ బెస్ట్ కంపెనీ Blaupunkt రోజు సోనిక్ Q సిరీస్ నుంచి ఇండియన్ మార్కెట్లో మూడు కొత్త QLED Smart Tvs విడుదల చేసింది. ఈ మూడు స్మార్ట్ టీవీలను 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ మరియు 80W Dolby సౌండ్ టెక్నాలజీ వంటి ఆకట్టుకునే మరిన్ని ఫీచర్స్ తో ఈ టీవీలను అందించింది. ఈ మూడు కొత్త స్మార్ట్ టీవీల ధరలు మరియు ఈ టీవీలు కలిగిన ఫీచర్స్ కూడా వివరంగా తెలుసుకుందాం.
బ్లౌపంక్ట్ ఈ మూడు స్మార్ట్ టీవీలను 55 ఇంచ్, 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ సైజుల్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే, 55 ఇంచ్ టీవీని రూ. 32,999 ధరతో, 65 ఇంచ్ టీవీని రూ. 44,999 ధరతో మరియు 75 ఇంచ్ టీవీని రూ. 65,999 ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు ఈరోజు నుంచి Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ ఈ కొత్త టీవీల పై మంచి బ్యాంక్ ఆఫర్స్ అందిస్తోంది.
ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా కేవలం స్క్రీన్ సైజులో మాత్రమే తేడాలు ఉంటాయి తప్ప ఫీచర్స్ మాత్రం ఒకే విధంగా ఉంటాయి. ఈ టీవీలు సాంప్రదాయ 60Hz రిఫ్రెష్ రేట్ కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్, డాల్బీ విజన్ మరియు HDR10+ వంటి విజువల్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీలు AI పవర్డ్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తాయి మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు లేటెస్ట్ గూగుల్ టీవీ 5.0 OS పై నడుస్తాయి. ఈ టీవీలు స్లీక్ అలాయ్ స్టాండ్ తో కూడిన బెజెల్ లెస్ ఎయిర్ స్లిమ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలు HDMI, USB, Av in, ఈథర్నెట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టవిటీ సపోర్ట్ కలిగి ఉంటాయి.
Also Read: BSNL : 500 కంటే తక్కువ ఖర్చుతో 72 రోజు అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
ఇక సౌండ్ పరంగా చూస్తే, ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా క్వాడ్ స్పీకర్ కలిగి టోటల్ 80W సౌండ్ అవుట్ పుట్ అందిస్తాయి. ఈ టీవీ డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో మరియు డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలు నెట్ ఫ్లిక్, ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్, యూట్యూబ్ వాటి 5 లక్షలకు పైగా అప్లికేషన్ లకు సపోర్ట్ చేస్తుంది.