Airtel Perplexity AI partnership offers free subscription for all users
Airtel perplexity AI : 360 మిలియన్ కస్టమర్ బేస్ తో దేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీగా వెలుగొందుతున్న ఎయిర్టెల్ ఈరోజు తన యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో మమేకమైన ఎయిర్టెల్ తన యూజర్లకు AI సర్వీస్ కోసం ఉచిత యాక్సెస్ అందించింది. దీనికోసం AI-powered పెర్ప్లెక్సిటీ తో పార్ట్నర్ గా ఎంచుకుంది. ఈ కొత్త చర్యతో ఎయిర్టెల్ యూజర్లకు రూ. 17,000 రూపాయల విలువైన Perplexity Pro యాక్సెస్ అందించింది.
పెర్ప్లేక్సిటీ ప్రో యాక్సెస్ ను ఎయిర్టెల్ యూజర్లు అందరికీ ఉచితంగా ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్లు ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది. అంటే, ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, Wi-Fi మరియు DTH వాడుతున్న అందరికీ ఈ ప్రీమియం AI ఫీచర్ యాక్సెస్ అందిస్తుంది. అంతేకాదు, యూజర్లకు నేరుగా ఉచిత ప్రీమియం AI సర్వీస్ ను ఉచితంగా అందించిన మొదటి టెలికాం కంపెనీ గా ఎయిర్టెల్ అవతరించింది.
ఎయిర్టెల్ యూజర్లు Airtel Thanks App ద్వారా ఈ కొత్త Ai సర్వీస్ ను పొందవచ్చు. దీనికోసం ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లో ఎయిర్టెల్ రిజిస్టర్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వగానే మీకు ఈ ఉచిత AI సర్వీస్ కోసం నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఈ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి సర్వీస్ ను అందుకోవచ్చు. ఒకవేళ ఈ నోటిఫికేషన్ మీకు అందకపోతే మీరు రివార్డ్స్ అండ్ OTTs ట్యాగ్ లోకి వెళ్ళి అందులో కొత్త రివార్డ్స్ లో ఈ కొత్త సర్వీస్ రివార్డ్ మీకు అంది ఉంటుంది. దీని ద్వారా మీరు ఈ Pro సర్వీస్ ను ఉచితంగా అందుకోవచ్చు.
Also Read: boAt 5.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ GOAT Sale జబర్దస్త్ డిస్కౌంట్ అందుకోండి.!
పెర్ప్లేక్సిటీ AI Pro అనేది Chat GPT 4.1, Claude మాదిరి అడ్వాన్స్డ్ AI మోడల్. ఇది డీప్ సెర్చ్, ఇమేజ్ జెనరేషన్, మరియు ఫైల్స్ అప్లోడ్ మరియు అనాలిసిస్ వంటి మరిన్ని ప్యానల్ చిటికెలో చేస్తుంది. ఈ ఎఐ సర్వీస్ యొక్క ప్రో మోడల్ గ్లోబల్ మార్కెట్ లో దాదాపు రూ. 17,000 ఖర్చుతో లభిస్తుంది. అయితే, ఈ కంపెనీతో ఎయిర్టెల్ చేసుకున్న పార్ట్నర్షిప్ తో ఎయిర్టెల్ యూజర్లకు ఇది పూర్తి ఉచితంగా లభిస్తుంది.