Airtel ధమాకా ఆఫర్: OTT తో పాటుగా అన్లిమిటెడ్ లాభాలతో కొత్త ప్లాన్ తెచ్చింది.!

HIGHLIGHTS

ఎయిర్టెల్ యూజర్ల కోసం Airtel ధమాకా ఆఫర్ ను తీసుకు వచ్చింది

OTT తో పాటు అన్లిమిటెడ్ లాభాలను అందించే కొత్త ప్లాన్ తెచ్చింది

అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది

ఎయిర్టెల్ యూజర్ల కోసం Airtel ధమాకా ఆఫర్ ను తీసుకు వచ్చింది. అదేంటంటే, OTT తో పాటుగా అన్లిమిటెడ్ లాభాలను అందించేలా ఒక కొత్త ప్లాన్ ను ఎయిర్టెల్ తెచ్చింది. ఈ ప్లాన్ బడ్జెట్ ధరలో ప్రముఖ ఓటిటి సబ్ స్క్రిప్షన్ మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని లాభాలను ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. అదే, ఎయిర్టెల్ రూ. 1,499 రూపాయల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను మరియు లాభాలను విపులంగా తెలుసుకోండి.

Airtel ధమాకా ఆఫర్

ఎయిర్టెల్ ముందు నుండే OTT ప్లాట్ ఫామ్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. అయితే, Disney+ Hotstar ఒక్క OTT తోనే ప్లాన్ లను ఆఫర్ చేస్తూ వచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్ లో కొనసాగుతున్న పోటీకి అనుగుణంగా Netflix OTT ప్లాట్ ఫామ్ తో కూడా రూ.1,499 కొత్త ప్లాన్ ను తీసుకు వచ్చింది. ఈ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

Also Read : Redmi 13C Series నుండి రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్న షియోమి.!

ఎయిర్టెల్ రూ. 1,499 ప్లాన్

ఎయిర్టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ 5G డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఒకవేళ మీరు 4G నెట్ వర్క్ ఉపయోగిస్తుంటే రోజుకు 3GB హై స్పీడ్ 4G డేటాని అందుకుంటారు. వీటితో పాటుగా డైలీ 100 SMS ల ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.

ఎయిర్టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్

ఇక ఈ ప్లాన్ తో అందించే ఉచిత ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో Netflix OTT ప్లాట్ ఫామ్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తోంది. అలాగే, మూడు నెలల అపోలో 24|7 యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్, మరియు ఉచిత వింక్ మ్యూజిక్ యాక్సెస్ ను కూడా అదనంగా అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :