Airtel: తక్కువ ఖర్చులో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించిన ఎయిర్టెల్.!

HIGHLIGHTS

భారతీ ఎయిర్టెల్ చాలా తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రకటించింది

ఈ ప్లాన్ తో తక్కువ ఖర్చులో లాంగ్ వ్యాలిడిటీ అందుకోవచ్చు

ఈ ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీ అందిస్తుంది

Airtel: తక్కువ ఖర్చులో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించిన ఎయిర్టెల్.!

భారతీ ఎయిర్టెల్ చాలా తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ తో తక్కువ ఖర్చులో లాంగ్ వ్యాలిడిటీ అందుకోవచ్చు. Airtel కొత్తగా తీసుకువచ్చిన రూ.1,799 చవక లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీ అందిస్తుంది. ఎయిర్టెల్ సరికొత్తగా తీసుకొచ్చిన ఈ వన్ ఇయర్ ప్లాన్ కంప్లీట్ డీటెయిల్స్ పైన ఒక లుక్కేద్దాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Airtel Rs.1,799 Plan:

ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ కొత్త వన్ ఇయర్ ప్లాన్ పూర్తిగా 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. ఈ ప్లాన్ తో  24 GB డేటా లభిస్తుంది. అయితే, ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తో మొత్తంగా 3600 SMS లను అఫర్ చేస్తోంది. అయితే, రోజు గరిష్టంగా 100 SMS లను మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుంది. 

ఇక ఈ ప్లాన్ అఫర్ చేసే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో ఎటువంటి అదనపు ఖర్చులేకుండా 3 నెలల Apollo 24/7 సర్కిల్ యాక్సెస్ పొందుతారు. అలాగే, FASTag పైన 100 క్యాష్ బ్యాక్ ను కూడా ఈ ప్లాన్ తో పొందుతారు. అంతేకాదు, Free హలొ ట్యూన్ మరియు Wynk Music యొక్క ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా మీకు అందిస్తుంది ఈ ప్లాన్.

Airtel యొక్క మరిన్ని బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo