ఎయిర్టెల్ – అమేజాన్ ప్రైమ్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ : డైలీ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ప్రైమ్ బెనిఫిట్స్

HIGHLIGHTS

రూ. 299 రూపాయల ధరతో ప్రారంభించబడింది మరియు వినియోగదారులకి రోజువారీ 2.5GB డేటా

ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లానుతో, అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్స్ మరియు ప్రైమ్ వీడియోలకు కూడా 28 రోజుల వరకు సబ్ స్క్రిప్షన్ అందుతుంది.

వినియోగదారులు Amazon.in మరియు అమెజాన్ పే ద్వారా ఈ ప్యాక్ యాక్టివేట్ చేయవచ్చు.

ఎయిర్టెల్ – అమేజాన్ ప్రైమ్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ : డైలీ 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ప్రైమ్ బెనిఫిట్స్

ఎయిర్టెల్ దాని #AirtelThanks కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఒక గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ను తన వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లానుతో, అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్స్ మరియు ప్రైమ్ వీడియోలకు కూడా 28 రోజుల వరకు సబ్ స్క్రిప్షన్ అందుతుంది. అంటే, డేటాతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఈ ప్లానుతో అందుకుంటారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ప్లాన్, రూ. 299 రూపాయల ధరతో ప్రారంభించబడింది మరియు వినియోగదారులకి రోజువారీ 2.5GB డేటా, అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 SMS లు కూడా లభిస్తాయి మరియు వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ యాక్సెస్ ను 28 రోజుల కోసం అందుకుంటారు. అంటే, అమేజాన్ ప్రైమ్ నుండి అన్లిమిటెడ్ HD కంటెంట్ (సినిమాలు, వీడియోలు, ప్రోగ్రాములు) చూడడానికి సరిపడినంత డేటా ఈ ప్లానుతో అందిస్తున్నదని చెప్పొచ్చు.     

అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ ను  AirTiltLanks ఆప్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని రిటైల్, ఎయిర్టెల్ స్టోర్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, www.airtel.in మరియు AirTiltLanks అప్లికేషన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు Amazon.in మరియు అమెజాన్ పే ద్వారా ఈ ప్యాక్ యాక్టివేట్ చేయవచ్చు.

AirtelThanks కార్యక్రమం గురించి మాట్లాడుతూ, ఇది మూడు ప్రణాళికలైన సిల్వర్ , గోల్డ్ మరియు ప్లాటినం లుగా విభజించబడింది. ఇందులో వినియోగదారులు ప్రతి సెగ్మెంట్లో కూడా వివిధ లాభాలను పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo