airtel announced adobe express access to all users
భారతదేశంలో డిజిటల్ యుగాన్ని మరింత శక్తివంతం చేయడానికి ఇటీవల Perplexity Ai యాక్సెస్ అందించిన ఎయిర్టెల్, ఇప్పుడు సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది మరియు కొత్త మైలు రాయిని కూడా రికార్డు చేసింది. 360 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి దేశంలో పెద్ద టెలికాం కంపెనీలలో ఒకటిగా సాగుతున్న Bharti Airtel తన యూజర్లకు Adobe Express Premium యాక్సెస్ ని పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఉచితంగా ప్రకటించింది. ఇటివంటి వినూత్నమైన ఆఫర్ ను అందించిన మొదటి టెలికాం కంపెనీగా ఎయిర్టెల్ ఇప్పుడు చరిత్ర పుటల్లో కెక్కింది.
క్రియేటివ్, మార్కెటింగ్, డిజైన్ అండ్ డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ ప్లాట్ ఫాం అయిన అడోబ్ సంస్థతో ఎయిర్టెల్ కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కొత్త ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 360 మిలియన్ల మంది యూజర్లు అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం యొక్క ఉచిత యాక్సెస్ పొందుతారు. ఇదేదో ఒక నెల యాక్సెస్ మాత్రమే ని అనుకోకండి, పూర్తి ఒక సంవత్సరం సబ్ స్క్రిషన్ ను ఎయిర్టెల్ యూజర్లకు పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.
వాస్తవానికి, అడోబ్ ఎక్స్ ప్రెస్ ఒక నెల యాక్సెస్ కోసం 398.84 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. అలాగే, 12 నెలల కోసం ఈ యాక్సెస్ లేదా సబ్ స్క్రిప్షన్ పొందాలంటే కనీసం రూ. 4,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఈ యాక్సెస్ ను ఇప్పుడు ఎయిర్టెల్ యూజర్లు ఉచితంగా అందుకుంటారు.
Also Read: Realme P4 Power: భారీ 10,001 mAh బ్యాటరీతో అవాక్కయ్యే ధరలో రిలీజ్ అయ్యింది.!
అడోబ్ ఎక్స్ ప్రెస్ అనేది అనేది Adobe సంస్థ రూపొందించిన అత్యాధునిక డిజైన్ అండ్ క్రియేటివ్ ప్లాట్‌ఫాం. ఇది సాధారణ డిజైనింగ్, వీడియో, సోషల్ మీడియా పోస్టులు, మార్కెటింగ్ మెటీరియల్స్, ఆహ్వానపత్రాలు వంటి మరెన్నో అత్యుత్తమ క్రియేటీవ్ కంటెంట్‌ను వేగంగా మరియు సులభంగా రూపొందించేందుకు సహాయపడుతుంది.
ఇది వీడియో ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడం మరియు కస్టమ్ ఇమేజ్ జనరేషన్ వంటి చాలా పనులు చిటికెలో చేసేస్తుంది. ఫైల్స్ ను ఎక్కడినుంచైనా యాక్సెస్ చేయడానికి వీలుగా 100GB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ఉచిత యాక్సెస్ తో లభిస్తుంది. ప్రొఫెషనల్ గ్రాఫిక్స్ అండ్ ఫోటోలు కలిగిన ప్రముఖ Adobe Stock యాక్సెస్ కూడా అందిస్తుంది. ముఖ్యంగా, మీరు చేసిన క్రియేటివ్ లకు వాటర్ మార్క్ లేని ఎక్స్‌పోర్ట్ ఆఫర్ చేస్తుంది.
వేగంగా పెరుగుతున్న AI యొక్క శక్తిని ఎయిర్టెల్ యూజర్లకు ఉచితంగా అందచేయడం యూజర్ల తోడ్పాటుకు మంచి చేయూత అవుతుంది. ఈ కొత్త చర్యతో 36 కోట్ల మంది ఎయిర్టెల్ యూజర్లకు 1 సంవత్సరం ఉచిత అడోబ్ ఎక్స్ ప్రెస్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.