SBI ఖాతాదారులకు హెచ్చరిక
SBI ఖాతాదారులకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా హెచ్చరిక జారీచేసింది.
ప్రస్తుతం, ఆన్లైన్ మోసాలు అధికంగా జరుగుతుండగా, వాటిలో ముఖ్యంగా వినియోగదారుల నిర్లక్ష్యం ఎక్కువగా కన్పిస్తోంది. అందుకే, ఇప్పుడు ప్రభుత్వ బ్యాంక్ అయినటువంటి SBI ఖాతాదారులకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా హెచ్చరిక జారీచేసింది. అసలు ఏమని హెచ్చరించిందనే విషయానికి వెళితే, తమ అకౌంట్ లకు సంబంచిన వివరాలైనటువంటి, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్ లేదా వారి బ్యాంక్ ఖాతాకు సంబంచిన మరే ఇతర వివరాలనైనా సరే అందరికి తేలిసేలా పబ్లిగ్గా ఎటువంటి సోషల్ మీడియాలోనైనా సరే షేర్ చేసినట్లయితే, అటుతరువాత జరిగే నష్టాలకు తాము ఎటువంటి బాధ్యతా వహించమని ప్రకటన చేసింది.
Survey
excluding such information to enable our team to respond. Further, please note that SBI or its employees will never send any payment link or ask for sensitive information like VPA-UPI related, User ID, PIN, Internet Banking passwords, CVV No, OTP etc., through (2/3)
— State Bank of India (@TheOfficialSBI) November 15, 2019
అలాగే, దీని గురించి పూర్తిగా వివరిస్తూ, బ్యాంక్ ఎప్పుడూ కూడా కస్టమర్ల అకౌంట్ లకు సంబధించిన వివరాలను ఎప్పుడు అడగదని తెలిపింది. అందులోనూ, OTP లేదా UPI కి సంభందించిన వివరాలు అడిగే అవసరం కూడా లేదని పేర్కొంది. దీని గురించి మాట్లాడుతూ, " దయచేసి గుర్తుచుకోండి, SBI లేదా అందులోని అధికారులు కానీ మీ అకౌంటుకు సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలైనటువంటి, యూజర్ ID, సెక్యూరిటీ PIN లేదా ఇంటర్నెట్ పాస్వర్డ్ వంటి వాటిని అడగరని, వాటితో వారికీ ఎటువంటి అవసరం ఉండదని మరియు ఫోన్ కాల్, SMS లేదా ఇమెయిల్ ద్వారా ఈ వివరాలను అడిగితే వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని" వివరించింది.
DISCLAIMER: Please do not share your account no., mobile no. or any personal or account related information publicly on this platform for security reasons. Bank will not be responsible for any loss. We request you to delete the information immediately and re-post/DM (1/3)
— State Bank of India (@TheOfficialSBI) November 15, 2019
వాస్తవానికి, గత కొద్దికాలంగా కొందరు సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును దండుకోవడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమిటంటే, మీ అకౌంట్ బ్లాక్ అయ్యిందని, దాన్ని బ్లాక్ చెయ్యకుండా ఉండాలంటే కొన్ని వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుందని, అందులో మీ అకౌంట్ నంబర్ తో సహా మీ సున్నితమైన PIN వంటి వివరాలను కూడా ఇవ్వవలసి ఉంటుందని SMS లేదా ఇమెయిల్ ద్వారా మెసేజిలను పంపుతున్నారు. వాటిని నమ్మి వాటిపైన క్లిక్ చేసి వివరాలను అందించిన వారి ఖాతాల నుండి డబ్బంతా ఊడ్చేస్తున్నారు. అందుకోసమే, SBI తన ఖాతాదారుల శ్రేయస్సు కోసం ఈ హెచ్చరికలను జారీచేసినట్లు తెలుస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile