షావోమి రెడ్మి K 20 ఫోన్ కేవలం రూ.1 కే ధరకే సొంతం చేసుకునే అవకాశం

Updated on 24-Sep-2019
HIGHLIGHTS

షావోమి తరపున తన Diwali With Me సేల్‌ను ప్రకటించింది

షావోమి తరపున తన Diwali With Me సేల్‌ను ప్రకటించింది, ఈ సెల్‌లో మీరు రెడ్‌మి నోట్ 7 ప్రో మరియు మి టివి, మి బ్యాండ్ 3 మరియు మరికొన్నింటితో  పాటు కేవలం 1 రూపాయలకు రెడ్మి K 20 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క ధరను కూడా ఈ సేల్ ద్వారా చెయ్యబోతోంది. ఈ సెల్‌లో, మీరు రెడ్మి నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్నుసుమారు 11,999 రూపాయల ప్రారంభ ధర వద్ద ఉండవచ్చు.

అయితే, దీపావళి సేల్ ని కేవలం షావోమి మాత్రమే ప్రకటించలేదు.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో, అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను కూడా నిర్వహించబోతున్నారు. అంతేకాదు, షావోమి యొక్క ఈ దీపావళి సేల్ అక్టోబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు నడుస్తుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా అమ్మకాలు తరువాత ప్రారంభం కానున్నాయి మరియు అక్టోబర్ 4 వరకు నడుస్తాయి.

షావోమి HDFC బ్యాంక్‌ యొక్క భాగస్వామ్యంతో ఈ సేల్ చేయనుంది. దీన్నిచేయడం ద్వారా, ఈ సెల్లో పాల్గొనే వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు  ఇవ్వబడుతుంది. షావోమి నుండి రెడ్మి నోట్ 7 ప్రో, రెడ్మి 7 ఎ, రెడ్మి వై 3, మి బ్యాండ్ 3, పవర్ బ్యాంకులు మరియు మరెన్నో ఫోన్లను షావోమి సెల్ నుండి  మీరు కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :