Redmi Note 11T 5G స్మార్ట్ ఫోన్ లాంచింగ్ కోసం షియోమి టీజింగ్ మొదలుపెట్టింది. ఈ నెల 30 న ఇండియాలో విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి కీలకమైన ఫీచర్ల గురించి కంపెనీ టీజింగ్ మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నట్లు షియోమి వెల్లడించింది.
Redmi Note 11T 5G లాంచ్ గురించి కంపెనీ CEO మనూ కుమార్ జైన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రకారం, రెడ్ మి నోట్ 11టి 5జి నవంబర్ 30న ఇండియాలో లాంచ్ కాబోతోంది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం తన అధికారిక వెబ్సైట్ mi.com నుండి ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. ఈ పేజ్ నుండి ఫోన్ ఫీచర్ల గురించి టీజింగ్ కూడా మొదలుపెట్టింది.
ఇక ఈ Redmi Note 11T 5G యొక్క అంచనా స్పెక్స్ గురించి కూడా చాలా నివేదికలు వెల్లడించాయి. కంపెనీ ఈ ఫోన్ యొక్క బెస్ట్ ఫీచర్లగా తీజ్ చేస్తున్న 4 విషయాలను గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ ఫాలెన్ చైనా లో ఇటీవల విడుదలైన Redmi Note 11 ఆధారితంగా ఉంటుందని కూడా అంచనా. ఈ ఫోన్ లేటెస్ట్ 5G ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ మరియు మెరుగైన కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.