Xiaomi Redmi Y3 అద్భుతమైన ఫీచర్లతో రేపు విడుదలకానుంది.

Xiaomi Redmi Y3 అద్భుతమైన ఫీచర్లతో రేపు విడుదలకానుంది.

ఈ రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ ముందుగా వచ్చినటువంటి రెడ్మి Y2 ఫోనుకు తరువాతి తరం ఫోనుగా రానుంది. అలాగే,  రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్ కలిగివున్నటువంటి 3080 mAh బ్యాటరీ కంటే అధికమైనశక్తీ కలిగిన ఒక 5000 mAh బ్యాటరీని అందించవచ్చని అర్ధమవుతోంది. రెడ్మి Y2 కంటే మెరుగైన సాఫ్ట్ వేర్ మరియు అప్డేట్లతో ఉండవచ్చు. అనుకున్నట్లుగానే, రెడ్మి Y సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లు కాబట్టి  ఇందులో 32MP సెల్ఫీ కెమేరాను అందించారు. అలాగే, mi.com నుండి చూపిన అప్డటెడ్ వివరాల ప్రకారంగా, నీటి తుంపర్ల నుండి రక్షణ అందించే విధంగా, స్పిల్ ప్రూఫ్ తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.   

ప్రస్తుతం నడుస్తున్న సెల్ఫీ ట్రెండ్ కి అనుగుణంగా అత్యధికమైన రిజల్యూషన్ కెమెరాతో రానున్న షావోమి యొక్క రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ డేట్ అందించింది. షావోమి యొక్క ఇండియా ట్విట్టర్ పేజీలో అందించిన ఒక టీజింగ్ ప్రకరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 24 వ తేదికి ఇండియాలో అధికారికంగా విడుదలకానుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ఒక సెల్ఫీ బీస్ట్ గా రానున్నట్లు కూడా వెల్లడైనది. ముందునుండే అంచనా వేస్తున్నట్లుగా ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమేరాతో రానుంది. అంతేకాదు, ఈ టీజింగ్ ఫోటోలో అందించిన ప్రకారంగా ఈ ఫోను ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు అందులో అమర్చిన 32MP సెల్ఫీ కెమేరాతో రానున్నట్లు అర్ధమవుతోంది.

ఇక ఈ ఫోన్ పైన సంస్థ చూపిస్తున్నఅంచనాలను చూస్తే, 48MP రియర్ ప్రధాన కెమేరాను కూడా అందిచవచ్చేమో అనిపిస్తోంది. ఎందుకంటే, కేవలం ఇందులో బ్యాటరీ మరియు కెమేరాలను మాత్రమే ప్రధానాంశాలుగా చూపిస్తోంది. అంతేకాదు, మరొక విషయం ఏమిటంటే అందరికంటే ముందుగా ఒక 48MP కెమేరాను మిడ్ రేంజ్ ధరలో అందించి మార్కెట్ ని కొల్లగొట్టిన రెడ్మి నోట్ 7 ప్రో గురించి మనకు తెలుసు కదా!. అలాగే, ఇందులో కూడా అదే కెమేరా సెటప్పును ఒక శామ్సంగ్ GM1 సెన్సారుతో అందించవచ్చని కూడా అనేక రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo