చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజమైన షావోమి, రెడ్మి Y3 యొక్క ఇండియా లాంచ్ డేట్ గురించి ఒక కొత్త టీజింగును అందించింది. షావోమి యొక్క ఇండియా ట్విట్టర్ పేజీలో అందించిన ఈ టీజింగ్ ప్రకరంగా, ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 24 వ తేదికి ఇండియాలో అధికారికంగా విడుదలకానుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ఒక సెల్ఫీ బీస్ట్ గా రానున్నట్లు కూడా వెల్లడైనది. ఎందుకంటే, ముందునుండే అంచనా వేస్తున్నట్లుగా ఏ ఫోన్ లోక 32MP సెల్ఫీ కెమేరాతో రానుంది. అంతేకాదు, ఈ టీజింగ్ ఫోటోలో అందించిన ప్రకారంగా ఈ ఫోను ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు అందులో అమర్చిన 32MP సెల్ఫీ కెమేరాతో రానున్నట్లు అర్ధమవుతోంది.
ముందుగా వచ్చిన కొన్ని నివేదికల ప్రకారంగా, రెడ్మి Y3 స్మార్ట్ ఫోన్ దీని మీదుగా వచ్చినటువంటి, రెడ్మి Y2 స్మార్ట్ ఫోన్ కలిగివున్నటువంటి 3080 mAh బ్యాటరీ కంటే అధికమైనశక్తీ కలిగిన ఒక 5000 mAh బ్యాటరీని అందించవచ్చని అర్ధమవుతోంది. రెడ్మి Y2 కంటే మెరుగైన సాఫ్ట్ వేర్ మరియు అప్డేట్లతో ఉండవచ్చు. అనుకున్నట్లుగానే, రెడ్మి Y సిరీస్ స్మార్ట్ ఫోన్లు సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్లు కాబట్టి ఇందులో 32MP సెల్ఫీ కెమేరాను అందించారు.
ఇక ఏ ఫోన్ పైన సంస్థ చూపిస్తున్నఅంచనాలను చూస్తే, 48MP రియర్ ప్రధాన కెమేరాను కూడా అందిచవచ్చేమో అనిపిస్తోంది. ఎందుకంటే, కేవలం ఇందులో బ్యాటరీ మరియు కెమేరాలను మాత్రమే ప్రధానాంశాలుగా చూపిస్తోంది. అంతేకాదు, మరొక విషయం ఏమిటంటే అందరికంటే ముందుగా ఒక 48MP కెమేరాను మిడ్ రేంజ్ ధరలో అందించి మార్కెట్ ని కొల్లగొట్టిన రెడ్మి నోట్ 7 ప్రో గురించి మనకు తెలుసు కదా!. అలాగే, ఇందులో కూడా అదే కెమేరా సెటప్పును ఒక శామ్సంగ్ GM1 సెన్సారుతో అందించవచ్చని కూడా అనేక రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.