చౌకధరలో ఎక్కువ ఫీచర్లు గల ఒక స్మార్ట్ ఫోన్నుకొనాలంటే, ఎక్కువగా ఆలోచించకుండా టక్కున చెప్పే పేరు షావోమి అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు. వాస్తవానికి, మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువమంది పోటీదారులు చాలా మంది ఉన్నాకూడా, తనదైన శైలిలో కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తూ, షావోమి గొప్ప అమ్మకాలను సాధిస్తోంది. అయితే, ఇటీవల చైనా, ఇండియాలో మరియు ఇతర దేశాలలో గొప్ప ఫీచర్లతో చాలా తక్కువ ధరకే విడుదల చేసిన REDMI NOTE 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు 1 కోటి అమ్మకాల మార్కును ధాటినట్లుగా తెలుస్తోంది.
ఈ అమ్మకాలను పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నమోదుచేసినట్లుగా చెబుతోంది. వాస్తవానికి, ఈ నోట్ 8 సిరీస్ విడుదలయ్యి కేవలం 3 నెలలు మాత్రమే అవుతుంది. అంటే, ఈ నోట్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు విడుదలైన కేవలం 3 నెలల వ్యవధిలోనే 1 కోటి అమ్మకాలను నమోదు చేశాయన్నమాట. ముందుగా, ఇండియాలో, బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని, 48MP మరియు 64MP క్వాడ్ కెమేరా మరియు మంచి ప్రత్యేకతలతో, రెడ్మి నోట్ 8 సిరీస్ నుండి విడుదల చేసినటువంటి, రెడ్మి నోట్ 8 మరియు రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్లు కేవలం ఒక్కనెలలోనే 10 లక్షల మార్క్ దాటినట్లు ప్రకటించింది.
రెడ్మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9,999 ధరలో ఒక 48MP క్వాడ్ కెమేరా, FHD డిస్ప్లే మరియు ముందు వెనుకా కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వంటి మంచి ఫీచర్లతో తీసుకురావడంతో, బడ్జెట్ వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ను కొనడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇక రెడ్మి నోట్ 8 ప్రో విహాసినికి వస్తే, ఈ ఫోన్ను గేమింగ్ ప్రత్యేకమైనటువంటి ఒక మీడియా టెక్ హీలియో G90 ప్రాసెసర్, ఒక ప్రధాన 64MP క్వాడ్ కెమేరా మరియు ఫోన్ను చల్లబరచడానికి ఒక లిక్విడ్ కూలింగ్ టెక్నాలజితో తీసుకురావడం ఈ ఫోన్ను మిడ్ రేంజ్ వినియోగదారుల ఎంపికగా మార్చింది.