షావోమి సంస్థ ఈరోజు ఇండియాలో తన రెడ్మి 8A స్మార్ట్ ఫోన్ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6,499 ధరతో విడుదలయ్యింది మరియు ఈ ధరలో మంచి స్పెక్స్ కూడా తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా, ఒక 5,000 బ్యాటరీని 18W స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించడం అభినందించాల్సిన విషయంగా చెప్పొచ్చు. అలాగే,ఈ ఫోన్ 2GB మరియు 3GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది.
1. రెడ్మి 8A (2GB +32GB ) ధర – Rs.6,499
2. రెడ్మి 8A (3GB +32GB ) ధర – Rs.6,999
ఈ రెడ్మి 8A డ్యూయల్ – సిమ్ స్మార్ట్ ఫోన్ మరియు 0 డివైజ్ 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 720P పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 6.22 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో అందించబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను Aura Wave గ్రిప్ కలిగిన డిజైన్ తో చేయడంవలన, వెనుక ప్యానల్ పైన ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ పడే అవకాశం ఉండదు మరియు ఎక్కువ గ్రిప్ అందుతుంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.0GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 2GB/3GB ర్యామ్ తో వస్తుంది. ఇది రెండువేరియంట్లలో కూడా 32GB స్టోరేజి కలిగివుంటుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజిని 512 GB వరకూ పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు కేవలం ఒక 12MP సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఇది Sony IMX363 సెన్సారుతో ఉంటుంది. అలాగే, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంటుంది. ఇక ఈ ఫోన్ను బలమైన 5,000 mAh బ్యాటరీతో మరియు 18W స్పీడ్ ఛార్జింగ్ సపోర్టుతో తీసుకొచ్చింది. అయితే, సెక్యూరిటీ పరంగా ఫేస్ అన్లాక్ ని మాత్రమే అందించింది. ఇది మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ బ్లూ మరియు సన్ సెట్ రెడ్ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.