షావోమి పోకో F1 Widevine L1 అప్డేట్ అందుకోనుంది, 4K@60fps, ఫేస్ అన్లాక్ ఆప్టిమైజేషన్, ఇంకా మరెన్నో..

Updated on 05-Apr-2019
HIGHLIGHTS

ఈ కొత్త అప్డేట్ OTA ద్వారా అందించబడుతుంది.

Xiaomi Poco F1 ఇప్పుడు కొత్తగా Widevine L1 DRM ధ్రువీకరణను అనుమతించే ఒక అప్డేటును అందుకుంటోంది. ఈ అప్డేట్ కూడా 60 FPS మరియు Poco యొక్క కొత్త గేమ్ టర్బో మోడ్ వద్ద 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లను తీసుకువస్తుంది. Widevine L1 సర్టిఫికేషన్, గత ఏడాది OTA అప్డేట్ వలనే అందుకోనుంది  మరియు వినియోగదారులు నెట్ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వంటి వాటిపైన మీకు ఇష్టమైన HD కంటెంట్ ని ప్లే చేయడానికి అనుమతిస్తుంది.

Xiaomi MIUI 10.3.4 అప్డేట్ తో వినియోగదారులకు ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. Poco F1 ఫోన్ యొక్క మరొక భారీ మార్పుగా, ఇప్పుడు దాని AI కెమెరా కోసం అందించిన కొత్త మోడ్, మరియు గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి గేమ్ టర్బో,వంటివి వుంటాయని పేర్కొన్నారు.

ఇతర కొత్త ఫీచర్ల గురించి మాట్లాడితే, ఆప్స్ కోసం ఫేస్ అన్లాక్ మరియు మార్చి 2019 Android సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ చెయ్యబడింది. పేస్ లాక్ అన్లాక్ ఉపయోగించి లాక్ స్క్రీన్ పై నిలచిపోవడం వంటి వాటికీ UI సొల్యూషన్స్ కూడా ఉన్నాయి, లాక్ స్క్రీన్ ఉన్నపుడు కూడా నోటిఫికేషన్ తెరవడం మరియు మరికొన్ని ఉంటాయి.

ఫేస్ అన్లాక్ అల్గోరిథంకు కూడా ఆప్టిమైజేషన్లు అందించారు మరియు మీరు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే ఇన్పుట్ కాల్స్ కోసం ఫ్లోటింగ్ విండోను జతచేస్తుంది.

ఇది ఈ ఫోనుకు ప్రధాన అప్డేట్ గా ఉంటుంది మరియు ఇది OTA అప్డేట్ ద్వారా పంపబడుతుంది. మా రివ్యూ యూనిట్ లో ఈ అప్డేట్ ను అందుకున్నాము. అప్డేట్ చేయడానికి ముందు మీ డేటాను బ్యాకప్ చెయ్యడం మర్చిపోకండి.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :