Xiaomi Mi 11 Lite: ఎక్కువ విశేషాలతో తక్కువ ధరలో వచ్చింది

Updated on 22-Jun-2021
HIGHLIGHTS

Xiaomi 11 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్

షియోమి మి 11 లైట్ ఎక్కువ విశేషాలతో తక్కువ ధరలో వచ్చింది

Xiaomi ఈరోజు ఇండియాలో తన 11 సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ ప్రకటించింది. అదే,  Xiaomi Mi 11 Lite స్మార్ట్ ఫోన్. ఈ షియోమి మి 11 లైట్ ఎక్కువ విశేషాలతో తక్కువ ధరలో వచ్చింది. ఈ ఫోన్ డిజైన్, బరువు మరియు ఇంకా మరిన్ని విషయాలలో బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ వైబ్రాంట్ కలర్స్ అందించ గల 10 బిట్ AMOLED డిస్ప్లే మరియు ట్రూ కలర్ టెక్నాలజీ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు పూర్తి వివరాలను తెలుసుకోండి.

Xiaomi Mi 11 Lite: ధర

Xiaomi Mi 11 Lite యొక్క 6GB మరియు 128GB బేస్ వేరియంట్ రూ.21,999 నుండి ప్రారంభమవుతుంది. 8GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ రూ.23,999 ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డ్ కలిగిన వారు ఈ ఫోన్ పైన 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

Xiaomi Mi 11 Lite: స్పెక్స్

మి 11 లైట్ 4G లో ఒక 6.55-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్ప్లే వుంది. ఈ డిస్ప్లే 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఉంటుంది. ఈ స్క్రీన్ HDR10 ప్లేబ్యాక్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు Gorilla Glass 5 ప్రొటక్షన్ కూడా కలిగివుంది.

మి 11 లైట్ కేవలం 6.8 మిల్లీమీటర్ల మందం మరియు అతితక్కువ 157 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ మరియు టుస్కానీ కోరల్ వంటి మూడుచక్కని కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Xiaomi Mi 11 Lite స్మార్ట్ న్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732 G శక్తితో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 618 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM వరకు మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. అంతేకాదు, మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజ్ ను పెంచుకునే ఎంపిక కూడా ఉంది. ఇది MIUI 12 పై పనిచేస్తుంది, ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఉంటుంది.

మి 11 లైట్‌ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో, f / 1.79 ఎపర్చరు గల 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 5 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది పంచ్-హోల్ నాచ్ కటౌట్ లోపల ఉంది.

ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ వుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు  4,250 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నలాజి సపోర్ట్ తో అందించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :