ఇండియాలో విడుదలైన షావోమి 108MP కెమెరా స్మార్ట్ ఫోన్

ఇండియాలో విడుదలైన షావోమి 108MP కెమెరా స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

ఈ ఫోను‌తో పాటుగా కంపెనీ Mi Box మరియు MiTrueWireless Ear Buds 2 ను కూడా విడుదల చేసింది.

షావోమి నుండి దాని ప్రధాన ఫ్లాగ్ ‌షిప్ స్మార్ట్ ‌ఫోన్ అయినటువంటి షావోమి Mi 10 ఇండియాలో లాంచ్ చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్, భారతదేశంలో ఈరోజు లాంచ్ చేయబడింది. ఈ ఫోను‌తో పాటుగా కంపెనీ Mi Box  మరియు MiTrueWireless Ear Buds 2 ను కూడా విడుదల చేసింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 సిరీస్, వన్‌ప్లస్ 8 సిరీస్ తో పాటు, ఈ స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్లో మరికొన్ని స్మార్ట్ ‌ఫోన్ల సరసన పోటీకి నిలబడబోతోంది.

షావోమి మి 10 మొట్టమొదట మార్చి 31 న ప్రారంభించాల్సి ఉండగా,  ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా ఇది దీని లాంచ్ డేట్  వాయిదా పడింది. కానీ ఎట్టకేలకు ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ప్రారంభించబడింది. అయితే, దీనిని భారత ప్రభుత్వం నిర్ణయించిన గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లలో మాత్రమే అమ్మవచ్చు.

షావోమి మి 10 : ధర మరియు అమ్మకం

షావోమి మి 10 స్మార్ట్ ఫోన్ రెండు వేర్వేరు వేరియంట్లలో లాంచ్ చేయబడింది, మీరు ఈ మొబైల్ ఫోన్ యొక్క 8 GB ర్యామ్ 128 జిబి మరియు 256 GB మోడళ్లలో ఎంచుకోవచ్చు. ఈ రెండు వేరియంట్ల ధర గురించి చూస్తే, మీరు బేస్ వేరియంట్ ‌ను 49,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, టాప్ మోడల్‌ కోసం చూస్తే దాన్ని రూ. 54,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్  యొక్క ప్రీ-ఆర్డర్ ప్రాసెస్ ఈరోజు నుండే అమెజాన్ ఇండియా మరియు mi.com నుండి  ప్రారంభమైంది.

మీరు ఈ స్మార్ట్ ఫోన్ను కొనాలనుకుంటే, మీరు దీన్ని HDFC  బ్యాంక్ యొక్క కార్డ్స్ ద్వారా రూ .3,000 క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు.  అంటే, మీరు ఈ మొబైల్ ఫోన్‌ తో ఈ ఆఫర్‌ను అందుకోవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోన్ ‌ను ముందస్తు ఆర్డర్ చేస్తే, మీకు Mi వైర్‌లెస్ ఛార్జర్‌ ను ఉచితంగా కూడా ఇస్తోంది. అయితే, మీరు గనుక రెడ్ జోన్ లో ఉంటే మాత్రం  ఈ మొబైల్ ఫోన్ అందుకోలేరని

 మీరు కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇ-కామర్స్ సేవలు ఇప్పటికీ ప్రభుత్వం నిలిపివేసింది. ఇది కాకుండా, ఈ  షావోమి మి 10 మొబైల్ ఫోన్ను ట్విలైట్ గ్రే మరియు కోరల్ గ్రీన్ వంటి రెండు వేర్వేరు రంగులలో కొనుగోలు చేయవచ్చు. 

షావోమి మి 10:  ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల FHD + సూపర్ అమోలెడ్ ప్యానెల్ స్క్రీన్‌ తో వచ్చింది. ఇది గొరిల్లా గ్లాస్ 5 తో సేఫ్టితో ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో మీరు 90Hz అధిక రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌ ను అందుకుంటారు. అధనంగా, ఈ మొబైల్ ఫోన్ కూడా HDR10 + ప్లేబ్యాక్‌ ధృవీకరనాటో వస్తుంది.

మీరు ఈ ఫోన్ డిస్ప్లేలో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పొందుతారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వేగవంతమైనటువంటి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఇది మీకు 5 జి సపోర్ట్‌తో లభిస్తుంది, అంతేకాకుండా ఇది ఆక్టా-కోర్ CPU , అడ్రినో 650 GPUతో  జత చేయబడింది. ఈ ఫోను‌లో మీరు 8GB తో పాటు 256GB  వరకు UFS 3.0 స్టోరేజ్ అందుకుంటారు.  అలాగే, ఏ ఫోన్ MIUI 11 ఆధారితమైన ఆండ్రాయిడ్ 10 OS తో లాంచ్ చేయబడింది.

ఈ ఫోన్ ‌లోని కెమెరా మొదలైన వాటి గురించి మాట్లాడితే, షావోమి మి 10 స్మార్ట్‌ ఫోన్  ఒక 108 MP ప్రధాన కెమెరాతో వస్తుంది. దీనికి తోడు ఈ ఫోను‌లో 13 MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరొక 2MP మాక్రో లెన్స్ తో పాటుగా 2MP డెప్త్ సెన్సార్ ఉంది. మీరు ఈ ఫోను‌లో 20MP ఫ్రంట్ కెమెరాను కూడా పొందుతారు. ఈ సెల్ఫీ కెమెరాను పంచ్-హోల్ నోచ్ లో చూడవచ్చు .

ఈ ఫోన్ ‌లో 4780 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 30W వేగవంతమైన ఛార్జింగ్‌ సపోర్ట్ తో లభిస్తుంది, దీనిలో మీరు వైర్డు మరియు వైర్‌లెస్ ఎంపికలను కూడా పొందవచ్చు. ఇది కాకుండా, మీరు ఈ ఫోను‌లో 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా పొందవచ్చు. అలాగే, షావోమికూడా వైర్‌లెస్ ఛార్జర్ ‌ను ప్రకటించింది  మరియు దీని కోసం విడిగా రూ .2500 ధర చెల్లించాలి వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo