షావోమి మి 10 ఇండియాలో మే 8 న విడుదలకానుంది

షావోమి మి 10 ఇండియాలో మే 8 న విడుదలకానుంది
HIGHLIGHTS

Mi 10, వన్‌ప్లస్ 8 సిరీస్ మరియు ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఇ 2020 లకు పోటీగా మారవచ్చు

కరోనావైరస్ వేగంగా  వ్యాప్తి చెందడం వలన,  మార్చి 22 న విధించిన దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మార్చి 31 న ప్రారంభించాల్సిన  షావోమి Mi10 లాంచ్ తేదీని వాయిదావేసింది. అయితే,  ప్రస్తుతం భరతదేశంలో ప్రకటించిన సడలింపుతో సానుకూల వాతావరణం నెలకొనడంతో, చివరకు భారతదేశంలో దీని లాంచ్ డేట్ ను ప్రకటించింది. గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలోని నిబంధనల ప్రకారం, స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయడమే కాకుండా, అమ్మకాలకు కూడా తెరతీస్తున్నారు.

షావోమి ఇండియా యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మే 8 న లైవ్ స్ట్రీమ్ ‌లో 108MP కెమెరా "మరియు మరిన్ని" ఫీచర్లతో  మి 10 ను ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది.

షావోమి ఇండియా VP, మను కుమార్ జైన్ గతంలో మి 10 ను చైనా నుండి దిగుమతి చేసుకుంటామని, భారతదేశంలో అసెంబుల్ లేదా తయారుచేసే విధంగా అభివృద్ధి చేస్తామని సూచించారు. షావోమి దాని ఇతర స్మార్ట్ ‌ఫోన్ల మాదిరిగా సరసమైనదిగా ఉండదని ఇది సూచిస్తుంది. అంతేకాకుండా, భారతదేశంలో విధించిన జీఎస్టీ పెంపు కూడా షావోమి నిర్ణయించిన ధరలకు వ్యతిరేకంగా ఉండేలా  చేస్తుంది.

చైనాలో, మి 10 CNY 3,999 నుండి మొదలవుతుంది మరియు ఇది భారతదేశంలో ప్రారంభించినప్పుడు సుమారు 42,000 రూపాయలకు మారవచ్చు. Mi 10, వన్‌ప్లస్ 8 సిరీస్ మరియు ఆపిల్ ఐఫోన్ ఎస్‌ఇ 2020 లకు పోటీగా మారవచ్చు, ఈ రెండూ ఇటీవలే ప్రకటించబడ్డాయి.

Xiaomi Mi 10

షావోమి మి 10 స్మార్ట్‌ ఫోన్(చైనా)  యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్ ఒక 6.7-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే 1120 నిట్ల బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోనులో మీకు సింగిల్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ లభిస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ తో స్క్రీన్‌ ను కలిగివుంది. ఇది కాకుండా, మీరు 180Hz టచ్ శాంప్లింగ్ రేటును కూడా పొందుతారు. ఇది వేగవంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 తో SoC తో విడుదల చెయ్యబడింది.

ఈ స్మార్ట్‌ ఫోనులో ఒక 4780 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 30W వైర్డ్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీతో అందించారు. మీరు ఈ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో చూడవచ్చు. ఇది కాకుండా, ఈ 4500mAh సామర్థ్యం గల బ్యాటరీతో పాటు, ఫోన్ యొక్క అనుకూల వెర్షన్‌లో మీకు 50W ఛార్జింగ్ మద్దతు లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌లో వై-ఫై 6 యొక్క మద్దతును కూడా అందుకుంటారు.

ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోనులో ఒక 108MP ప్రధాన కెమెరా ఇవ్వబడింది. ఇది ఐసోసెల్ బ్రైట్ HMX సెన్సార్, దీనిని శామ్‌సంగ్ తయారు చేస్తుంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోనులోని వెనుక కెమెరాలో మీకు 13MP  సెన్సార్ మరియు రెండు 2 ఎంపి సెన్సార్లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ ముందుభాగంలో మీరు 20MP సెన్సార్ సెల్ఫీ కెమెరాగా ఇవ్వబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo