రెడ్మి K20 మరియు రెడ్మి K20 ప్రో లాంచ్ : కళ్లుచెదిరే ప్రత్యేకతలు వీటి సొంతం

HIGHLIGHTS

షావోమి ప్రకటించిన చాలాకాలం తరువాత ఎట్టకేలకు, రెడ్మి K20 సిరీసును విడుదలచేసింది.

Redmi K20 ప్రో ను క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 SoC తో అందిస్తే Redmi K20 స్మార్ట్ ఫోన్ను ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 730 ప్రాసెసరుతో అందించింది.

Redmi K20 సిరీస్ ఫోన్లను మీరు 3D గ్లాస్ ఫినిష్ తో పూర్తి గ్లాస్ బాడీతో పొందుతారు.

రెడ్మి K20 మరియు రెడ్మి K20 ప్రో లాంచ్ :  కళ్లుచెదిరే ప్రత్యేకతలు వీటి సొంతం

షావోమి ప్రకటించిన చాలాకాలం తరువాత ఎట్టకేలకు, రెడ్మి K20 సిరీసును విడుదలచేసింది. ఇందులో, రెడ్మి K20 మరియు రెడ్మీ K20 ప్రో లను తీసుకొచ్చింది. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఫోన్లను కూడా విడుదలచేసింది. షావోమి,  Redmi K20 మరియు దాని Pro వేరియంట్ ని కూడాఅందించింది. ఈ రెండు ఫోన్ల యొక్క స్పెక్స్ దాదాపుగా విధంగా వుంటాయి కానీ,  ఈ రెండు ఫోన్ల యొక్క ప్రాసెసరులో మాత్రం కొంత వ్యత్యాసాన్ని చేశారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

షావోమి,  Redmi K20 ప్రో ను క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 SoC తో అందిస్తే Redmi K20 స్మార్ట్ ఫోన్ను ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 730 ప్రాసెసరుతో అందించింది. అలాగే, ఇవి కాకుండా ఈ ఫోన్లలో ఎన్నో ట్రెండీ ఫీచర్లను అందుకుంటారు. Redmi K20 సిరీస్ ఫోన్లను మీరు 3D గ్లాస్ ఫినిష్ తో పూర్తి గ్లాస్ బాడీతో పొందుతారు. ఇవి రెడ్ , బ్లూ మరియు కార్బన్ ఫైబర్ వంటి కలర్ ఎంపికలతో లభిస్తాయి.

Redmi K20 Pro మరియు Redmi K20 యొక్క ధర మరియు లభ్యత

Redmi K20 Pro స్మృతి ఫోన్ను 4 రకాలైన వేరియంట్లలో తీసుకొచ్చింది. దీని బేస్ వేరియంట్ 6GB RAM మరియు 64GB స్టోరేజితో, 2499 యువాన్  (సుమారు రూ 25,000 ధరకే) ధరతో అందించారు. మరొక 6GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్, 2599 యువాన్ (సుమారు రూ 26,000 ధరకే) మరియు 8GB RAM మరియు 128GB స్టోరేజి వేరియంట్, 2799 యువాన్ (సుమారు రూ 28,000 ధరకే) ఉంటుంది. ఇక చివరిదైన 8GB RAM మరియు 256GB స్టోరేజి వేరియంట్ 2999 యువాన్ (సుమారు రూ 30,000 ధరగా) నిర్ణయించింది. 

ఇక Redmi K20 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, దీని యొక్క బేస్ వేరియంట్ అయిన, 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి వేరియంట్, 1999 యువాన్ (సుమారు రూ 20,000 రూపాయలు) ధరతో మరియు 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి వేరియంట్, 2099 యువాన్ (సుమారు రూ 21,000 రూపాయల) ధరకే అందించింది.

రెడ్మి K20 ప్రో యొక్క మొదటి సేల్ జూన్ 1 న చైనాలో జరుగుతుంది, రెడ్మి K20 యొక్క సేల్ జూన్ 6 న ప్రారంభించబడుతుంది.

Redmi K20 Pro  మరియు Redmi K20 :  ప్రత్యేకతలు

షావోమి  ఈ రెడ్మి K20 ప్రో స్మృతి ఫోనులో 7 వ తరం ఇన్  డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. రెడ్మి K20 మరియు K20 ప్రో స్మార్ట్ ఫోన్లు రెండు కూడా NFC మద్దతుతో వస్తాయి. Redmi K20 ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని అందించింది.      

ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే HDR కంటెంటుకు  మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్  ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది.అయితే,  రెడ్మి K20 మాత్రం ఒక స్నాప్డ్రాగెన్ 730 చిప్సెట్టుతో వస్తుంది

రెడ్మి K20 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ కెమేరాని అందించింది రెండు ఫోన్లలో, సోనీ IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇవ్వబడింది. ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్  లెన్స్ కలిగి ఉంది. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 మెగాపిక్సెల్స్ పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఇందులో, 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh,బ్యాటరీని ఇచ్చింది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile