Xiaomi Hyper OS 3: ఆండ్రాయిడ్ 16 OS తో యూజర్లకు గుడ్ న్యూస్ తెలిపిన షియోమీ.!

Updated on 17-Dec-2025
HIGHLIGHTS

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ గుడ్ న్యూస్ అందించింది

హైపర్ OS 3 అప్డేట్ ను ఇప్పుడు షియోమీ 14 సిరీస్, ప్యాడ్ మరియు రెడ్ మీ ఫోన్స్ లో కూడా విడుదల చేస్తోంది

ఈ సిరీస్ నుంచి అందించిన ప్రీమియం వేరియంట్స్ కు మాత్రమే అందుతుంది

Xiaomi Hyper OS 3: భారతదేశంలో చెప్పుకోదగిన ఎక్కువగా స్థాయిలో స్మార్ట్ ఫోన్ యూజర్ బేస్ కలిగిన చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమీ గుడ్ న్యూస్ అందించింది. ఇండియాలో ముందు కేవలం షియోమీ ప్రీమియం సెగ్మెంట్ ఫోన్స్ అయిన షియోమీ 15 సిరీస్ ఫోన్స్ కోసం మాత్రం అందించిన హైపర్ OS 3 అప్‌డేట్ ను ఇప్పుడు షియోమీ 14 సిరీస్, ప్యాడ్ మరియు రెడ్ మీ ఫోన్స్ లో కూడా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా చెబుతున్నారు.

Xiaomi Hyper OS 3: కొత్త అప్‌డేట్

సెప్టెంబర్ 2025 లో చైనా మార్కెట్ లో విడుదల చేసిన షియోమీ 17 సిరీస్ ఫోన్లతో హైపర్ OS 3 ని కంపెనీ పరిచయం చేసింది. ఈ అప్డేట్ ను చైనా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఇండియాలో ముందుగా షియోమీ 15 సిరీస్ ఫోన్స్ లో అందించిన షియోమీ, ఇప్పుడు షియోమీ 14 సిరీస్, రెడ్ మీ నోట్ 14 సిరీస్ మరియు రెడ్ మీ నోట్ 14 సిరీస్ కోసం రోల్ అవుట్ చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఇది ఇప్పటి కూడా ఈ సిరీస్ నుంచి అందించిన ప్రీమియం వేరియంట్స్ కు మాత్రమే అందుతుంది.

అంతేకాదు, షియోమీ మరియు రెడ్ మీ ఫోన్స్ తో పాటు పోకో లేటెస్ట్ ఫోన్ పోకో F7, పోకో M7 ప్రో మరియు ప్యాడ్ 7 కూడా ఈ కొత్త OS అప్డేట్ అందుకునే వరుసలో ఉన్నాయి. ఈ కొత్త OS అప్డేట్ తో గూగుల్ యొక్క లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం Android 16 OS అందుతుంది. ఇది మాత్రమే కాదు కొత్త AI పవర్ కూడా ఈ ఫోన్స్ లో చేరుతుందని షియోమీ చెబుతోంది. ఏ అప్డేట్ ఒకేరోజులో అందరికీ అందుబాటులో ఉండదు. మీరు మీ ఫోన్ లో కొత్త అప్డేట్స్ సెహెక్ చేస్తూ ఉంటే ఈ అప్డేట్ మీ ఫోన్ లో అందుకున్న వెంటనే ఈ ఫోన్ కూడా ఈ కొత్త OS కి అప్డేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇప్పటికే నోటిఫికేషన్ వస్తే, వెంటనే అప్డేట్ చేసుకోండి.

Also Read: BSNL: నెలకు కేవలం రూ. 200 ఖర్చుతోనే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు పొందండి.!

Xiaomi Hyper OS 3: కొత్త అప్‌డేట్ విశేషాలు

ఈ కొత్త అప్డేట్ తో మీ షియోమీ ఫోన్ లో ఆండ్రాయిడ్ 16 OS వచ్చి చేరుతుంది. ఇది మేజర్ అప్డేట్ కాబట్టి మీ ఫోన్ లో కనీసం 5 జీబీ నుంచి 10 జీబీ వరకు స్టోరేజ్ స్పేస్ ఉంచండి. ఈ అప్డేట్ తో మరింత ఉన్నతమైన AI కేపబిలిటీస్ ఫోన్ లో చేరతాయి. అంటే, మీ ఫోన్ మరింత వేగంగా స్పందించే Ai సపోర్ట్ కలిగి ఉంటుంది.

ముఖ్యంగా, ఈ అప్డేట్ తో షియోమీ ఫోన్స్ లో కూడా యాపిల్ ఫోన్స్ మాదిరి డైనమిక్ ఐల్యాండ్ అందుతుంది. ఇందులో సెల్ఫీ కెమెరా చుట్టూ ఒక చిన్న సైజు ఐల్యాండ్ మీ ఫోన్ లో కొత్తగా ప్రత్యక్షం అవుతుంది మరియు ఇందులో కాల్, మెసేజ్, మ్యూజిక్ వంటి మరిన్ని నోటిఫై చేయబడతాయి. ఇందులో కొత్త హోమ్ స్క్రీన్, లిక్విడ్ గ్లాస్ లుక్, AI డైనమిక్ వాల్ పేపర్స్ మరియు వేగంగా యాప్స్ లాంచ్ అవ్వడం వంటి మరిన్ని గొప్ప అప్డేట్స్ ఇందులో ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :