షావోమి యొక్క ఈ ఫోన్ల కోసం Android 9 Pie అప్డేట్ అందనుంది

HIGHLIGHTS

షావోమి, ఈ సంవత్సరం విడుదల చేసిన అన్ని ఫోన్లను Android 9 Pie తో అందించగా, ఇప్పుడు కొన్ని పాత ఫోన్లకు కూడా ఈ అప్డేట్ సిద్ధంచేసింది.

షావోమి యొక్క ఈ ఫోన్ల కోసం Android 9 Pie అప్డేట్ అందనుంది

షావోమి ముందుగా అందించిన సంస్థ యొక్క కొన్ని స్మార్ట్ ఫోన్ల కోసం Android 9 Pie ని ప్రకటించనుంది. షావోమి, ఈ సంవత్సరం విడుదల చేసిన అన్ని ఫోన్లనుAndroid 9 Pie తో అందించగా, ఇప్పుడు కొన్ని పాత ఫోన్లకు కూడా ఇప్పుడు ఈ అప్డేట్ సిద్ధంచేసింది. అయితే,ఈ అప్డేట్ ను రెండు దశలలో అందించనుంది. ఎలాగంటే, ముందుగా 2019 Q1 (2019 జనవరి 1 నుండి మార్చి 31 వరకు) పరిధిలో షావోమి రెడ్మి నోట్ 5 మరియు రెడ్మి Y2 లకు ఈ Android 9 Pie అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అటు తరువాత, 2019 Q2 (2019 ఏప్రిల్ 1 నుండి జూన్ 30 వరకు) పరిధిలో రెడ్మి 6, రెడ్మి 6A, రెడ్మి నోట్ 3, మి 6 మరియు మి మిక్స్ 2 స్మార్ట్ ఫోన్లకు ఈ అప్డేటును అందిస్తుంది. అంతేకాదు, ముందుగా చేసిన ఒక పనివేదిక ప్రకారం, త్వరలోనే షావోమి యొక్క కొత్త  బీటా అప్డేట్లను విడుదల చేయనుంది మరియు ముందుగా వచ్చిన MIUI 10 కి అప్డేటుగా కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇంతకు ముందు,  MIUI యొక్క తదుపరి అప్డేటును అందించడం కోసం పనిచేస్తున్నట్లు, కంపెనీ జనవరిలోనే ధృవీకరించింది.  షావోమి పూర్తిగా కొత్త ROM తో ముందున్న ROM ను పూర్తిగా ఒక కొత్త ఇంటర్ఫేసుతో పునఃరూపకల్పన చేయడానికి చూస్తోంది. అలాగే, దీని గురించి వివరిస్తూ "స్మూత్ అండ్ బ్యూటిఫుల్," "న్యూ ఐకాన్," "గ్లోబల్ నైట్ మోడ్" వంటి థీమ్ లను అమలు చేయండంతో పాటుగా మరిన్ని కొత్త ఫీచర్లని ఈ కొత్త అప్డేట్ తీసుకొస్తుంది.

ఈ కొత్త ROM అప్డేట్  స్వీకరణకు అనుమతిగల హ్యాండ్ సెట్ల యొక్క జాబితాను కూడా ప్రకటించారు.  షావోమి యొక్క ఆ స్మార్ట్ ఫోన్ల  జాబితా చుస్తే గనుక : షావోమి మి 9, మి 8, మి 6X, మి 6, మి 5c, మి 5X, మి 5s, మి 5s ప్లస్ మరియు మి ప్లే వంటివి ఉన్నాయి. ఇంకా, మి మిక్స్ సిరీస్లో, మి మిక్స్ 3, మి మిక్స్ 2S, మి మిక్స్ 2, మరియు మి మిక్స్ 1 లను,  ఈ కొత్త MIUI ROM తో అప్డేటుచేయవచ్చు. అలాగే,  మి నోట్ 2, మి నోట్ 3, మి మాక్స్ 2, మి మాక్స్, మి మాక్స్ 3, ఇతర డివైజెస్ కూడా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo