Xiaomi 15 Ultra: 8K కెమెరా మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్.!

Updated on 03-Mar-2025
HIGHLIGHTS

Xiaomi 15 Ultra లాంచ్ కంటే ముందే కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ రివీల్

షియోమీ ఈ ఫోన్ ను 8K కెమెరా మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది

ఈ ఫోన్ డిజైన్ కూడా ఒక సూపర్ కాంపాక్ట్ కెమెరా మాదిరిగా చేసింది

Xiaomi 15 Ultra : షియోమీ లేటెస్ట్ ప్రీమియం ఫోన్ ఇండియా లాంచ్ కంటే ముందే కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ రివీల్ చెయ్యబడ్డాయి. ఈ ఫోన్ ప్రైస్ ను మాత్రం మార్చి 11వ తేదీ రివీల్ చేస్తుంది. షియోమీ ఈ ఫోన్ ను 8K కెమెరా మరియు స్టన్నింగ్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ డిజైన్ కూడా ఒక సూపర్ కాంపాక్ట్ కెమెరా మాదిరిగా చేసింది. అంతేకాదు ఈ ఫోన్ తో ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ కిట్ లెజండ్ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది.

Xiaomi 15 Ultra: ఫీచర్స్

ఈ షియోమీ లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ సెట్ కలిగిన Qualcomm AI engine తో ఈ ఫోన్ కు గొప్ప AI సపోర్ట్ ను అందిస్తుంది. దీనికి జతగా LPDDR5X 16GB ర్యామ్ మరియు 512GB (UFS 4.1) హెవీ మరియు వేగవంతమైన ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను 6.73 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో అందించింది. అయితే, ఈ స్క్రీన్ WQHD+ (3200 x 1440) రిజల్యూషన్, 1-120Hz రిఫ్రెష్ రేట్ మరియు 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ను అత్యంత కఠినమైన షియోమీ షీల్డ్ గ్లాస్ 2.0 రక్షణతో అందించింది.

ఇక ఈ ఫోన్ కెమెరా వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ ఈ విభాగంలో నమ్మశక్యం కాని వివరాలు కలిగి ఉంటుంది. ఇందులో వెనుక 50MP మెయిన్ + 200MP అల్ట్రా టెలిఫోటో + 50MP ఫ్లోటింగ్ టెలిఫోటో + 50MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన క్వాడ్ రియర్ కెమెరా సిస్టం ఉంటుంది. ఈ కెమెరాలు అన్ని కూడా మొబైల్ కోసం Leica ప్రత్యేకంగా అందించిన కెమెరాలు. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 30FPS తో 8K వీడియోలు, 120FPS తో 4K వీడియోలు షూట్ చేయవచ్చని షియోమీ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో కూడా Dolby Vision 4K వీడియోలు 30 fps మరియు 60fps వద్ద కూడా షూట్ చేయవచ్చట.

షియోమీ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను 5410 mAh బిగ్ బ్యాటరీతో అందించింది. ఈ ఫోన్ 90W హైపర్ ఛార్జ్ మరియు 80W వైర్లెస్ హైపర్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంది. ఇందులో వేగవంతమైన షియోమీ 3D డ్యూయల్ ఛానల్ ఐస్ లూప్ సిస్టం కూడా ఉంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించింది.

Also Read: Poco M7 5G : బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Xiaomi 15 Ultra: ప్రైస్

షియోమీ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రైస్ ను మాత్రం మార్చి 11వ తేదీ విడుదల చేయనున్నట్లు షియోమీ ప్రకటించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :