జియో మరియు ఎయిర్టెల్ లకు షాకిచ్చిన వోడాఫోన్ : 365 రోజులకు, డైలీ 1.5 డేటా ఉచితంగా ఇస్తానంటోంది.

జియో మరియు ఎయిర్టెల్ లకు షాకిచ్చిన వోడాఫోన్ : 365 రోజులకు, డైలీ 1.5 డేటా ఉచితంగా ఇస్తానంటోంది.
HIGHLIGHTS

ఎయిర్టెల్ మరియు జియో నుండి రోజు రోజుకు ఎదుర్కుంటున్న గట్టి పోటిని తట్టుకుని తన సబ్ స్క్రైబర్లను పెంచుకునే దిశగా సాగేందుకు కొత్త కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

ఎయిర్టెల్ మరియు జియో నుండి రోజు రోజుకు ఎదుర్కుంటున్న గట్టి పోటిని తట్టుకుని తన సబ్ స్క్రైబర్లను పెంచుకునే దిశగా సాగేందుకు కొత్త కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన తన ప్రీపెయిడ్ అఫర్ ద్వారా, వోడాఫోన్ తన వినియోగదారులకి, రోజుకు 1.5 GB డేటాని ఉచితంగా అందిచనుంది. ఇందుకోసం వోడాఫోన్ వినియోగదారులు, వోడాఫోన్ ఆప్ లేదా వెబ్ పేజీ నుండి సిటీ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు కోసం నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, బ్యాంకు రూల్స్ ప్రకారంగా ఈ క్రెడిట్ కార్డును పొందిన తరువాత, ఆ కార్డును ఉపయోగించి 4,000 రూపాయల షాపింగ్ చేయాల్సివుంటుంది.

అంతేకాదు, ఈ చేసే చాపింగును కూడా కేవలం కార్డు చేతికొచ్చిన 30 రోజుల లోపుగానే చేయాల్సి ఉంటుంది. అలాగే, దీనితో పాటుగా బ్యాంక్ కండిషన్ల విషయానికి వస్తే,  కేవలం జూలై 31 వ తేదీ వరకూ మాత్రమే ఈ అఫర్ అందుబాటులో ఉంటుంది. అంటే, ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ అఫర్ అన్నమాట. అంతేకాదు ఈ కారుకు అప్లై చేసేవారికి కనీసం 23 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

అధనంగా, ఈ పైన తెలిపిన అన్ని వివరాలు సరిపోయినా కూడా మరొక కండిషన్ వుంది. అదేమిటంటే, ఈ అన్ని వివరాలు సరిపోయిన అవోడాఫోనే వినియోగదారుడు, హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగుళూరు, చెన్నై, కోయంబత్తూర్, పూణే, ముంబాయి, గురుగ్రామ్, అహ్మదాబాద్, జైపూర్ మరియు చండీఘడ్ వంటి సిటీలకు చెందిన వారికీ మాత్రమే ఈ కార్డు దొరుకుతుంది.                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo