Vivo Y400 5G: Y సిరీస్ నుంచి మరో స్టన్నింగ్ ఫోన్ లాంచ్ చేసిన వివో.!

Updated on 04-Aug-2025
HIGHLIGHTS

వివో ఈ రోజు Y సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ Vivo Y400 5G లాంచ్ చేసింది

వివో వై 400 5జి ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో అందించింది

ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది

Vivo Y400 5G: గత వారం వివో టి సిరీస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ T4R ను విడుదల చేసిన వివో, ఈ రోజు Y సిరీస్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే, వివో వై 400 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 2 చిప్ సెట్ మరియు గొప్ప డిజైన్ తో అందించింది. వివో ఇండియాలో రోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఫోన్ ధర మరియు స్పెక్ట్స్ వంటి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

Vivo Y400 5G: ప్రైస్

వివో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ మరియు రెండు రంగుల్లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 21,999 ధరతో మరియు 8 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ. 23,999 ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆలివ్ గ్రీన్ మరియు గ్లామ్ వైట్ రెండు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఆగస్టు 9వ తేదీ నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ వివో అఫీషియల్ సైట్ మరియు అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తుంది.

Vivo Y400 5G: స్పెక్స్

వివో వై 400 5జి స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు P3 వైడ్ కలర్ గాముట్ వంటి ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది. వివో ఏ ఫోన్ ను క్వాల్కమ్ 4 జెన్ సిరీస్ లో కొత్త అందించిన Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ వై సిరీస్ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. వై 400 స్మార్ట్ ఫోన్ ఫన్ టచ్ OS 15 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఈ ఫోన్ లో 8GB ఎక్స్ పాండబుల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

కెమెరా పరంగా, వివో వై 400 స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ మరియు 2MP కెమెరాలు కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా అందించింది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ అండర్ వాటర్ ఫోటోగ్రఫీ, నైట్ పోర్ట్రైట్, లైవ్ ఫోటో వంటి మరిన్ని కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Hi Res ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Also Read: Oppo K13 Turbo Series : ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ కలిగిన మొదటి ఫోన్ గా వస్తోంది.!

ఈ వివో ఫోన్ 6000 mAh బిగ్ స్మార్ట్ ఫోన్ కలిగి చాలా స్లీక్ డిజైన్ లో డిజైన్ చేయబడింది. ఈ బ్యాటరీ త్వరగా ఛార్జ్ కావాలంటే దానికి తగిన వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండాలి. అందుకే, ఈ ఫోన్ లో 90W అల్ట్రా వస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ IP68 + IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుందని వివో చెబుతోంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :