Vivo X500 Pro Max: 8K వీడియో రికార్డింగ్ చేసే 200MP ZEISS కెమెరాతో వచ్చింది.. ప్రైస్ అండ్ ఆఫర్లు ఇవే.!
వివో ఈరోజు భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్ షిప్ X500 సిరీస్ ను విడుదల చేసింది
Vivo X500 Pro Max ఫోన్ అత్యాధునిక కెమెరా టెక్నాలజీ, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది.
ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ చేసే 200MP ZEISS APO టెలిఫోటో కెమెరాతో వచ్చింది
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో ఈరోజు భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్ షిప్ X500 సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్ హై ఎండ్ మోడల్ Vivo X500 Pro Max ను కూడా ఈరోజు పరిచయం చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక కెమెరా టెక్నాలజీ, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్ తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా, ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ చేసే 200MP ZEISS APO టెలిఫోటో కెమెరాతో వచ్చింది. మరింత ఆకట్టుకునే విషయం ఏమిటంటే, ఈ ఫోన్ 240 FPS తో 4K స్లో మోషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
Vivo X500 Pro Max: ధర
వివో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ని రూ.1,64,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. అదేవిధంగా,ఈ ఫోన్ హాయ్ ఎండ్ 12GB + 512GB మోడల్ ను రూ.1,79,999 ధరతో అందించింది. ఈ ఫోన్ అపెక్స్ ఆరెంజ్ మరియు ఎటర్నల్ బ్లాక్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది.
SALE
ఈ ఫోన్ ప్రీ బుకింగ్ లను కూడా కూడా రోజు నుంచే ప్రారంభం చేసింది. ఈ ఫోన్ ప్రీ బుకింగ్ నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని వివో ప్రకటించింది. ఇక సేల్ విషయానికి వస్తే, డిసెంబర్ 3 నుంచి ఈ ఫోన్ Amazon, Flipkart మరియు Vivo ఇండియా ఆన్ లైన్ స్టోర్ లతో పాటు ఆఫ్ లైన్ రిటైల్ దుకాణాల్లో సేల్ అవుతుంది.
లాంచ్ ఆఫర్లు
ఈ ఫోన్ పైన జబర్దస్త్ లాంచ్ ఆఫర్స్ వివో అందించింది. ఈ ఫోన్ ను ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు EMI ఆఫర్ తో తీసుకునే వారికి ఏకంగా రూ. 16,500 రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ పై గరిష్టంగా రూ. 23,000 వరకు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ని వివో ప్రకటించింది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను క్యాష్ బ్యాక్ లేదా EMI ఆఫర్ తో కలిపి పొందలేరు.
Vivo X500 Pro Max: ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్ ను 6.85 ఇంచెస్ బిగ్ AMOLED LTPO డిస్ప్లే తో అందించింది. ఈ స్క్రీన్ 2K రిజల్యూషన్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు 5,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాదు, ఇది HDR 10+ మరియు డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, వివో ఈ ఫోన్ ను MediaTek యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9600 Pro తో ఈ ఫోన్ ను అందించింది. ఇది 2nm ప్రాసెసర్ మరియు 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్ జతగా 256GB/512GB UFS 4.1 స్టోరేజ్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అందిస్తుందని వివో తెలిపింది. Origin OS 7 సాఫ్ట్ వేర్ జతగా Android 17 ఆపరేటింగ్ సిస్టం పైన ఈ ఫోన్ నడుస్తుంది.
కెమెరా విభాగానికి వస్తే, OIS సపోర్ట్ కలిగిన 50MP ZEISS మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 200MP ZEISS APO టెలిఫోటో కెమెరా కలిగిన రియర్ కెమెరా ఇందులో ఉంది. అలాగే, ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్ మరియు 120FPS 4K వీడియో రికార్డింగ్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, అనేక కొత్త కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఈ ఫోన్ లో 7,800mAh బిగ్ బ్యాటరీ, 90W వైర్డ్ ఛార్జ్ మరియు 40W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్స్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది.