VIVO X500 5G కొత్త తరం కెమెరా మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది .. ప్రైస్ ఫీచర్స్ చూద్దామా.!
VIVO X500 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది
సిరీస్ నుంచి వివో ఎక్స్ 500 5జి స్మార్ట్ ఫోన్ ని బేసిక్ వేరియంట్ గా అందించింది
ఈ స్మార్ట్ ఫోన్ ని కొత్త తరం కెమెరా మరియు ఫీచర్స్ తో విడుదల చేసి వివో ఆకట్టుకుంది
VIVO X500 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ ని ఈరోజు వివో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ సిరీస్ నుంచి వివో ఎక్స్ 500 5జి స్మార్ట్ ఫోన్ ని బేసిక్ వేరియంట్ గా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ని కొత్త తరం కెమెరా మరియు ఫీచర్స్ తో విడుదల చేసి వివో ఆకట్టుకుంది. ఈ ఫోన్ చూడగానే ఆకట్టుకునే సరికొత్త డిజైన్ కలిగి ఉండటం మాత్రమే కాకుండా అద్భుతమైన ఇమేజ్ లను అందించే కెమెరాతో పాటు గొప్ప గేమింగ్ అందించే చిప్ సెట్ కూడా కలిగి ఉంటుంది.
VIVO X500 5G : ప్రైస్
వివో ఈ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ రూ. 1,19,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రెండు సరికొత్త అందమైన కలర్స్ లో లభిస్తుంది. వివో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ లను ఈ రోజు నుంచే ప్రారంభించింది. డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.
VIVO X500 5G : ఫీచర్స్
ఈ వివో ఎక్స్ 500 5జి స్మార్ట్ ఫోన్ ముందు మరియు వెనక గ్లాస్ మరియు మధ్యలో అల్యూమినియం ఫ్రేమ్ తో చాలా అందంగా డిజైన్ చేయబడింది. ఈ ఫోన్ కేవలం 8.15mm మందంతో సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ లో 6.59 ఇంచ్ ఫ్లెక్సిబుల్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు అధిక బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ HDR10+ సపోర్ట్ మరియు Netflix HDR సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను మీడియాటెక్ లేటెస్ట్ అండ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9600M తో లాంచ్ చేసింది. ఇది 3nm ప్రాసెసర్ మరియు చాలా గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన చిప్ సెట్ తో పాటు ఈ ఫోన్ ను 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 256జీబీ UFS 4.1 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ Origin OS 7 సాఫ్ట్ వేర్ తో జతగా Android 17 ఆపరేటింగ్ సిస్టం పైన పని చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP AF సపోర్టెడ్ LYTIA 828 సెన్సార్, 50MP వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 64MP టెలిఫోటో (OIS) సెన్సార్ లు ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ సినిమాటిక్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది. ఇందులో ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ మరియు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ లో 4K సినిమాటిక్ వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది.
ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 7500 mAh భారీ బ్యాటరీ వుంది. అలాగే, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ మరియు 40W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది. వివో ఎక్స్ 500 5జి స్మార్ట్ ఫోన్ బ్లూటూత్ 6.0 సపోర్ట్ మరియు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది.