Vivo X300 FE: కాంపాక్ట్ సైజులో జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వివో ఎక్స్ 300 సిరీస్ బేసిక్ వేరియంట్ ఎక్స్ 300 FE ఫోన్ ను ఈరోజు లాంచ్ చేసింది

Vivo X300 FE ని కాంపాక్ట్ సైజులో జబర్దస్త్ ఫీచర్స్ తో విడుదల చేసింది

వివో ఈ ఫోన్ ని క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో అందించింది

Vivo X300 FE: వివో ఎక్స్ 300 సిరీస్ బేసిక్ వేరియంట్ ఎక్స్ 300 FE ఫోన్ ను ఈరోజు లాంచ్ చేసింది. వివో ఈ కొత్త ఫోన్ ని కాంపాక్ట్ సైజులో జబర్దస్త్ ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ ఫోన్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్స్ ఉన్నా చాలా పవర్ ఫుల్ ఫీచర్స్ మరియు కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఫీచర్స్ మరియు ఆఫర్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

Vivo X300 FE: ప్రైస్

వివో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ బేసిక్ 12GB + 256GB వేరియంట్ ని రూ. 79,999 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ 12GB + 512GB వేరియంట్ ని రూ. 89,999 ధరతో అందించింది. ఈ ఫోన్ లీలాక్ పర్పల్, నోయిర్ బ్లాక్ మరియు అర్బన్ ఆలివ్ మూడు రంగుల్లో లభిస్తుంది.

సేల్ అండ్ ఆఫర్స్

మే 14వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి ఈ ఫోన్ లభిస్తుంది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ను వివో మొదలు పెట్టింది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, HDFC, SBI, Axis మరియు UPI పేమెంట్ పై 10% ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను ఈ ఫోన్ పై అందించింది. అంతేకాదు, రూ. 5,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్, 24 నెలల నో కాస్ట్ EMI మరియు 1 సంవత్సరం అదనపు వారంటీ కూడా అందించింది.

Vivo X300 FE: ఫీచర్స్

వివో ఎక్స్ 300 FE ఫోన్ 6.31 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ మరియు HDR10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ని క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ కలిగిన ప్రాసెసర్ తో జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ సపోర్ట్ కూడా అందించింది.

ఈ వివో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ సెటప్ లో 50MP (Sony IMX 921) మెయిన్ కెమెరా, 50MP ZEISS టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP ZEISS వైడ్ యాంగిల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ తో పాటు వివో ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.

Also Read: Vivo X300 Ultra: క్లవర్ డిజైన్ మరియు అల్ట్రా క్లియర్ కెమెరాతో లాంచ్ అయ్యింది.!

వివి ఎక్స్ 300 FE స్మార్ట్ ఫోన్ కాంపాక్ట్ సైజులో కూడా 6500mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 40W వైర్‌లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ వివో కొత్త ఫోన్ ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :