Vivo X300 5G launched with premium design and features
Vivo X300 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ వివో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ అల్యూమినియం బాడీ, స్ట్రాంగ్ గ్లాస్ ఫైబర్ గ్లాస్ మరియు IP69 రేటింగ్ వంటి స్ట్రాంగ్ డిజైన్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్, ఫీచర్స్ మరియు ప్రైస్ తో పాటు కంపెనీ అందించిన లాంచ్ ఆఫర్లు కూడా వివరంగా చూద్దాం.
వివో ఈ కొత్త ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ధర వివరాలు క్రింద చూడవచ్చు.
వివో ఎక్స్ 300 (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 75,999
వివో ఎక్స్ 300 (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 81,999
వివో ఎక్స్ 300 (16 జీబీ + 512 జీబీ) వేరియంట్ ప్రైస్ : రూ. 85,999
ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం అండర్ రూ. 75,000 ధరలో కొనసాగుతున్న చాలా స్మార్ట్ ఫోన్ లకు పోటీ ధరలో మరియు పోటీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
ఈ లేటెస్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా వివో ప్రకటించింది. ఈ ఫోన్ పై SBI, HDFC,IDFC FIRST క్రెడిట్ కార్డు పై 10% భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఫోన్ స్క్రీన్ పై వన్ ఇయర్ ఎక్స్టెండ్ వారంటీ మరియు రూ. 1,499 రూపాయల వివో TWS 3e ఇయర్ బడ్స్ కూడా ఉచితంగా అందిస్తుంది. డిసెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: ఇక ప్రతి ఫోన్ లో Sanchar Saathi App కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు.!
ఈ వివో లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ అల్యూమినియం అల్లాయ్ బాడీ మరియు వెనుక ఫైబర్ గ్లాస్ బ్యాక్ డిజైన్ తో వచ్చింది. ఇది 6.31 ఇంచ్ కాంపాక్ట్ స్క్రీన్ కలిగి సింగిల్ హ్యాండ్ కాంపాక్ట్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 1.5K+ రిజల్యూషన్ కలిగిన AMOLED స్క్రీన్ ఉంటుంది మరియు ఇది 3D అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1–120 Hz LTPO రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ కేవలం 1.05mm అంచుతో కంప్లీట్ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది.
వివో ఎక్స్ 300 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో విజువల్స్ మరియు కెమెరా కోసం ప్రత్యేకమైన చిప్ సెట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16 జీబీ LPDDR5X మరియు 512 జీబీ ఫాస్ట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మన్స్ అందిస్తుందని ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ లో వివో తెలిపింది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 200MP HPB (OIS) మెయిన్ కెమెరా, 50MP (JN1) వైడ్ యాంగిల్ కెమెరా, 50MP (Sony LYT-602) టెలిఫోటో (OIS) మరియు జతగా లేజర్ ఫోకస్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 120 FPS డాల్బీ విజన్ 4K వీడియో సపోర్ట్ తో ఉంటుంది మరియు టన్నుల కొద్దీ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 60 FPS 4K వీడియో సపోర్ట్ కలిగిన 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
వివో ఎక్స్ 300 స్మార్ట్ ఫోన్ లో 6040 బిగ్ బ్యాటరీ అందించింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ సపోర్ట్ మరియు 40W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ వివో యొక్క లేటెస్ట్ Origin OS 6 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ IP 68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా వచ్చింది.