Vivo X Fold 5 : అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు ZEISS కెమెరా సెటప్ తో లాంచ్ అయ్యింది.!

Updated on 14-Jul-2025
HIGHLIGHTS

వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ ను వివో ఈరోజు విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు ZEISS కెమెరా సెటప్ తో లాంచ్ చేసింది

ఈ ఫోల్డ్ ఫోన్ మడత విప్పినప్పుడు కేవలం 4.30mm తో చాలా స్లీక్ గా ఉంటుంది

Vivo X Fold 5 : వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ ను వివో ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా స్లిమ్ డిజైన్ మరియు ZEISS కెమెరా సెటప్ తో లాంచ్ చేసింది. ఈ ఫోల్డ్ ఫోన్ మడత విప్పినప్పుడు కేవలం 4.30mm తో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ వివో లేటెస్ట్ ఫోల్డ్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Vivo X Fold 5 : ఫీచర్లు

వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ మడత విప్పినప్పుడు 8.03 ఇంచ్ పరిమాణం ఉండే AMOLED స్క్రీన్ తో అందించింది. ఇందులో 6.53 ఇంచ్ వెలుపలి మెయిన్ స్క్రీన్ ఉంటుంది మరియు ఇది AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ డాల్బీ విజన్ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ కొత్త వివో ఫోల్డ్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో అందించింది. ఈ ఫోన్ మరింత వేగంగా ఉండడానికి వీలుగా ఇందులో 16 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.

ఈ వివో లేటెస్ట్ ఫోల్డ్ ఫోన్ కంప్లీట్ గా ZEISS ఆప్టిక్స్ మరియు కెమెరా ఫిల్టర్లు కలిగిన కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony IMX921 OIS) VCS మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ (JN1) కెమెరా మరియు 50MP (Sony IMX882) టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది 3x ఆప్టికల్ జూమ్ మరియు 100x హైపర్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 20MP కవర్ స్క్రీన్ సెల్ఫీ మరియు మెయిన్ స్క్రీన్ లో 20MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ AI ఇమేజ్ స్టూడియో, AI మ్యాజిక్ మూవీ, AI ఇమేజ్ ఎక్స్ ప్యాండర్ మరియు AI ఎరేజర్ వంటి చాలా AI కెమెరా ఫీచర్లు, 4K వీడియో రికార్డింగ్ మరియు గుట్టల కొద్దీ మరిన్ని కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది.

ఈ ఫోల్డ్ ఫోన్ PX8, IPX9, IPX9+ మరియు IP5X రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. వివో ఈ ఫోన్ లో 6000 mAh బిగ్ బ్యాటరీ అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నా కూడా వివో ఈ ఫోన్ లో పెద్ద బ్యాటరీ సదుపాయం అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ మరియు 40W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో కూడా అందించింది.

Vivo X Fold 5 : ప్రైస్

వివో ఈ ఫోన్ ను 16 జీబీ మరియు 512 జీబీ కలిగిన సింగల్ వేరియంట్లో అందించింది. ఈ ఫోన్ ను రూ. 1,49,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.

Also Read: Vivo X200 FE 5G: ప్రీమియం ఫీచర్స్ వచ్చిన వివో కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

ఆఫర్లు

వివో ఎక్స్ ఫోల్డ్ 5 ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వివో అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు ICICI డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు EMI ఆఫర్ తో తీసుకునే యూజర్లకు రూ. 15,000 భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ఈరోజు అంటే, జూలై 15వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పై రూ. 15,000 రూపాయల వరకు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :