Vivo V70: లాంచ్ డేట్ , అంచనా ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

Vivo V70 వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫైన్ సిరీస్ వివో వి 70 నుంచి రాబోతున్న అప్ కమింగ్ ఫోన్

ఈ ఫోన్ ZEISS పవర్ ఫుల్ కెమెరా సెటప్ బిగ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి

ఈ వివో ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 తో లాంచ్ అవుతుంది

Vivo V70: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫైన్ సిరీస్ వివో వి 70 నుంచి రాబోతున్న అప్ కమింగ్ ఫోన్ గురించి మార్కెట్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే, ఈ ఫోన్ ZEISS పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో పాటు గొప్ప డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో ఇప్పుడు చెప్పిన అన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ గురించి సర్వత్రా వినిపిస్తోంది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ , అంచనా ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ కూడా ఈరోజు ఇక్కడ అందించాము.

Vivo V70: లాంచ్ డేట్?

వివో వి 70 స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా టీజింగ్ చేయబడుతోంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి కూడా సేల్ అందుబాటులోకి వస్తుంది.

Vivo V70: ఫీచర్స్

వివో వి70 స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా, చాలా స్లీక్ మరియు ఏరో స్పేస్ స్పేస్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో ఈ ఫోన్ తయారు చేయబడింది. ఇది కాంపాక్ట్ డిజైన్ లో మరియు చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో కేవలం 0.125cm థిన్ బెజెల్స్ కలిగిన 6.5 ఇంచ్ OELD స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

ఈ వివో ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 తో లాంచ్ అవుతుంది. ఇది 4nm ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ మరియు 1.8 మిలియన్ AnTuTu స్కోర్ కలిగి ఉంటుంది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ కి జతగా 12GB LPDDR5 ర్యామ్ మరియు 512 జీబీ UFS 4.1 వరకు స్టోరేజ్ కలిగి ఉంటుందని లేటెస్ట్ గా వచ్చిన లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 6500 mah బ్లూ వోల్ట్ బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాలో 50MP ZEISS మెయిన్ కెమెరా, జీయస్ అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 50MP ZEISS నైట్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో రికార్డింగ్, 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ OS తో వస్తుంది మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Also Read: EPFO 3.0 కొత్త అప్‌డేట్ తో పిఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయడం మరింత సులభం.!

వివో వి70 అంచనా ప్రైస్

ఇక ఈ ఫోన్ అంచనా దారి విషయానికి వస్తే, ఈ ఫోన్ అండర్ రూ. 50,000 రూపాయల బడ్జెట్ ధరలో ఇండియాలో అడుగు పెట్టే అవకాశం ఉందని ఆ అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ పాషన్ రెడ్ మరియు లెమన్ ఎల్లో రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :