Vivo V70 FE 5G: ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరాతో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది

ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది

ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా వివో అనౌన్స్ చేసింది

Vivo V70 FE 5G: గత నెల రోజులుగా వివో టీజింగ్ చేస్తున్న వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ధరలో భారీ 200MP కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందామా.

Vivo V70 FE 5G: ప్రైస్

వాస్తవానికి, ఈ ఫోన్ లాంచ్ కావడానికి అంటే ముందే ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. కంపెనీ కూడా అదే లీక్డ్ ప్రైస్ ను నిజం చేస్తూ సేమ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • వివో వి70FE (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 37,999
  • వివో వి70FE (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 40,999
  • వివో వి70FE (12 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 44,999

ఈ వివో ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మాన్సూన్ బ్లూ మరియు నాథర్న్స్ లైట్ పర్పల్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ల ను ఈరోజు నుంచి వివో స్టార్ట్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఈ సేల్ ప్రారంభం అవుతుంది.

ఆఫర్స్

ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా వివో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై Axis అండ్ కోటక్ బ్యాంక్ 10% తక్షణ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఇది కాకుండా 10% ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఈ ఫోన్ పై అందించింది. అదనంగా, ఈ ఫోన్ పై 1 సంవత్సరం అదనపు వారంటీ మరియు iQOO TWS 1e ఇయర్ బడ్స్ ను తక్కువ రేటుకే అందుకునే అవకాశం కూడా అందించింది.

Also Read: Realme 16 5G: సరికొత్త డిజైన్ మరియు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :