Vivo V70 మరియు V70 Elite ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వివో.!

Updated on 05-Feb-2026
HIGHLIGHTS

Vivo V70 మరియు V70 Elite ఇండియా లాంచ్ డేట్ అనౌన్స్

సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది

వివో స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది

Vivo V70 మరియు V70 Elite స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్నట్లు గత వారం చివరిలో టీజర్ విడుదల చేసిన వివో, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న ఫోన్ లను సరికొత్త డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాను.

Vivo V70 మరియు V70 Elite : లాంచ్ డేట్ ఏమిటి?

వివో వి 70 మరియు వివో వి70 ఎలైట్ రెండు స్మార్ట్ ఫోన్ లను కూడా ఫిబ్రవరి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ అండ్ టైం ను ఈరోజు కంపెనీ అధికారికంగా అనౌన్స్ చేసింది. కేవలం డేటా మాత్రమే కాదు ఈ ఫోన్ కీలకమైన అన్ని ఫీచర్స్ కూడా వివో రివీల్ చేసింది.

Vivo V70 మరియు V70 Elite : ఫీచర్స్

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను కూడా ZEISS ఆప్టిక్స్ తో అందిస్తున్నట్లు క్లియర్ చేసింది. ఈ సిరీస్ ను క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 3 లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ ను మరింత వేగంగా నడిపించడానికి సహాయంగా LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ ను కూడా ఈ ఫోన్ లో జత చేసింది. వివో వి70 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ ఫోన్ చాలా సింపుల్ అండ్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. మంచి క్లారిటీ విజువల్స్ అందించే 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, వివో 7వి సిరీస్ ఫోన్లు వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో 50MP ZEISS మెయిన్ సెన్సార్, ZEISS అల్ట్రా వైడ్ మరియు 50MP ZEISS నైట్ టెలిఫోటో కెమెరా లను కలిగి ఉంటుంది. అలాగే, ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గొప్ప జూమ్ క్లారిటీతో 60FPS 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా గుట్టల కొద్దీ వివో కెమెరా ఫిల్టర్లు మరియు ఫీచర్లతో పాటు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: SONY BRAVIA 2 Smart Tv పై బిగ్ డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!

ఈ వివో అప్ కమింగ్ ఫోన్ లో 6500 mAh బ్లూ వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS తో వస్తుంది మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :