Vivo V60e launched with 200mp camera under midrange price segment
Vivo V60e: వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో వి60e ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 200MP సూపర్ కెమెరా మరియు చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ AI ఫెస్టివల్ పోర్ట్రైట్ ఫీచర్ కలిగిన ఫస్ట్ ఫోన్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ పూర్తిగా తెలుసుకోండి.
వివో వి60e స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఈ క్రింద చూడవచ్చు.
వివో వి60e (8 జీబీ + 128 జీబీ) ధర : రూ. 29,999
వివో వి60e (8 జీబీ + 256 జీబీ) ధర : రూ. 31,999
వివో వి60e (12 జీబీ + 256 జీబీ) ధర : రూ. 33,999
వివో ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్ ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ నోబెల్ గోల్డ్ మరియు ఎలైట్ పర్పల్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్లు కూడా వివో ప్రకటించింది. ఈ ఫోన్ పై NO Cost EMI, రూ. 3,200 ఇన్స్టాంట్ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 3,400 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ ప్రకటించింది.
వివో ఈ ఫోన్ ను సూపర్ స్లీక్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360-Turbo చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇందులో 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించింది. ఈ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOELD స్క్రీన్ ని ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ 200MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి వివో ఫోన్ గా ఇది నిలిచింది. ఈ ఫోన్ లో ముందు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, AI ఫోర్ సీజన్ పోర్ట్రైట్, 85mm టెలిఫోటో క్లోజప్ మరియు AI ఫెస్టివల్ పోర్ట్రైట్ కెమెరా వంటి జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: ఫస్ట్ హైబ్రిడ్ ఫోన్ HMD Touch 4G ని లాంచ్ చేసిన నోకియా యాజమాన్య కంపెనీ.!
ఈ వివో ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉన్నా కూడా భారీ 6500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ గిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.