Vivo V50
Vivo V50: వివో అప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన వివో ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్ లను కూడా లాంచ్ కంటే ముందుగానే వివో బయట పెట్టింది. వివో వి50 స్మార్ట్ ఫోన్ ను గొప్ప కెమెరా కెమెరా సిస్టం మరియు మరిన్ని ఫీచర్స్ తో తీసుకొస్తున్నట్లు వివో భారీగా టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూద్దామా.
ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వివో వి50 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ను రోజ్ రెడ్, స్టారీ బ్లూ మరియు టైటానియం గ్రే మూడు కలర్స్ లో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ కూడా చేసింది.
వివో ఈ ఫోన్ ను చాలా అందమైన మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. చాలా సన్నగా మరియు ఆకర్షణీయంగా ఉండేలా వివో ఈ ఫోన్ ను డిజైన్ చేసింది.
ఈ ఫోన్ అతి ప్రధానమైన ఫీచర్స్ లో ఈ ఫోన్ కెమెరా ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ మూడు కెమెరాలు కూడా ZEISS ఆప్టిక్స్ తో అందించింది. అంతేకాదు, ఈ కెమెరా సెటప్ కు తగిన గొప్ప ఫిల్టర్లు మరియు AI సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో అందించినట్లు చెబుతోంది.
వివో వి50 స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ స్క్రీన్ తో ఈ ఫోన్ లో ఇన్ఫినిటీ వ్యూ ఆఫర్ చేస్తుంది. ఈ స్క్రీన్ కోసం అత్యంత కఠినమైన డైమండ్ షీల్డ్ గ్లాస్ ను కూడా జత చేసింది.
Also Read: Samsung పవర్ ఫుల్ Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ ఆఫర్ అందుకోండి.!
వివో వి50 స్మార్ట్ ఫోన్ లో 6000 mAh భారీ బ్యాటరీ ఉంటుందని వివో ప్రకటించింది. ఈ బిగ్ బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేసే 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా అందిస్తుంది.