వివో గత కొంత కాలంగా టీజింగ్ చేస్తూ వస్తున్న ViVO V25 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను వెనుక కలర్ ఛేంజింగ్ గ్లాస్ తో పాటుగా 64MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు FHD+AMOLED డిస్ప్లే మరియు 8GB ఎక్స్ టెండేడ్ ర్యామ్ సపోర్ట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వివో ఆవిష్కరించింది. ఈరోజు నుండి ప్రీ బుకింగ్స్ కు అంధుబాటులోకి వచ్చిన ఈ వివో స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచరాలు ఉన్నాయో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ViVO V25 5G : ధర మరియు ఆఫర్లు
వివో వి25 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.27,999. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ.31,999. ఈ ఫోన్ పైన కంపెనీ లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. HDFC,SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.2,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Vivo V20 Pro స్మార్ట్ ఫోన్ 6.44-అంగుళాల FHD+ (2376 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన AMOLED ప్యానెల్‌ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో తయారు చేయబడింది, కాబట్టి ఇది రంగులు మారుస్తుంది. వి 25 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో మీడియాటెక్ 5G ప్రాసెసర్ Dimensity 900 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది.
వివో వి 25 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 64 ఎంపి ప్రాధమిక కెమెరా, 8 ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. అయితే, ప్రో మాదిరిగా OIS సపోర్ట్ ను మాత్రం ఇందులో అందించలేదు. ఇక ముందు వైపు, 50MP Eye AF సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. V25 5G స్మార్ట్ ఫోన్ 44W ఫ్లాష్ ఛార్జ్ 4 సపోర్ట్ కలిగిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile