Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ 44MP AF భారీ సెల్ఫీ కెమెరాతో వచ్చింది

Updated on 21-Feb-2022
HIGHLIGHTS

Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది

44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ Android 12 OS

V23e 5G ఫోన్ లో 44MP ఐ AF సెల్ఫీ కెమెరాని అందించింది

వివో ఈరోజు 44MP భారీ సెల్ఫీ కెమెరాతో Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ Android 12 OS వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా కలిగివుంది. వివో V23 సిరీస్ నుండి వచ్చిన మూడవ స్మార్ట్ ఫోన్ Vivo V23e 5G. ఈ స్మార్ట్ ఫోన్ రూ.25,999 రూపాయల ధరతో ప్రకటించింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో లేటెస్ట్ గా వచ్చిన ఈ వివో స్మార్ట్ ఫోన్ పూర్తి విశేషాలు చూద్దాం.

Vivo V23e 5G: Price

Vivo V23e 5G స్మార్ట్ ఫోన్ కేవలం 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ కలిగిన ఒకేఒక్క వేరియంట్ తో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.25,990 రూపాయలుగా నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క సేల్స్  ఫిబ్రవరి 21, అంటే ఈరోజు నుండి ప్రారంభమైంది మరియు వివో ఇండియా ఇ-స్టోర్, Flipkart మరియు వివో భాగస్వామి రిటైల్ స్టోర్ల ద్వారా కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Vivo V23e 5G: స్పెక్స్      

వివో వి23e 5G స్మార్ట్ ఫోన్ 6.56 ఇంచ్ AMOLED కర్వ్డ్ డిస్ప్లేని FHD+ (2400×1080)రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లేలో  వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కూడా అందించింది. ఈ ఫోన్ MediaTek Dimensity 810 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో లభిస్తుంది. అధనంగా, ఎక్స్ టెండెడ్ RAM 2.0 ఫీచర్ తో 4GB వరకూ వర్చువల్ ర్యామ్ అందుతుంది.     

ఈ ఫోన్ డిజైన్ పరంగా కేవలం 7.32mm మందంతో చాలా సన్నగా ఉంటుంది మరియు బ్యాక్ గ్లాస్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ మరియు సన్ షైన్ గోల్డ్ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

V23e 5G ఫోన్ లో 44MP ఐ AF సెల్ఫీ కెమెరాని అందించింది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో,  50MP మైన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ కలిగిన 4050mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 ఆధారితంగా Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :