Vivo V23 Series: ఆన్లైన్లో లీకైన V23 Pro ధర మరియు స్పెక్స్

Updated on 30-Dec-2021
HIGHLIGHTS

జనవరి 5 న విడుదలకానున్న Vivo V23 series

ఆన్లైన్లో లీకైన వివో వి23 ప్రో ధర మరియు స్పెక్స్

HDR 10+ సపోర్ట్ కలిగిన AMOLED డిస్ప్లే

వివో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ Vivo V23 సీరీస్ నుండి V23 మరియు V23 Pro లను జనవరి 5 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఈ ఫోన్ల గురించి కొన్ని స్పెక్స్ ను టీజింగ్ ద్వారా అందించినా, ఈ ఫోన్ల గురించి ఎక్కువ సమాచారం మాత్రం వెల్లడించలేదు. అయితే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక లీక్ ద్వారా ఈ ఫోన్ యొక్క ధర మరియు అంచనా స్పెక్స్ అన్ని కూడా బయటకి వచ్చాయి.

ప్రముఖ టిప్స్టర్ యోగేష్ బ్రార్ చేసిన ట్వీట్ ప్రకారం, వివో వి23 ప్రో రూ.37,000 నుండి రూ.40,000 మద్యలో ఉండవచ్చని సూచించారు. అలాగే, ప్రస్తుతం రూ. 29,999 ధరతో రిటైల్ అవుతున్న Vivo V21 స్థానంలో V23 వస్తుందని కూడా వెల్లడించారు. కొన్ని స్పెక్స్ కూడా ఈ ట్వీట్ ద్వారా వివరించారు.     

Vivo V23 Pro: టీజ్డ్ మరియు లీక్డ్ స్పెక్స్

వివో ఇప్పటికే తన వెబ్ సైట్ ద్వారా అందించిన వివరాల ప్రకారం, Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 4GB ఎక్స్టెండేడ్ ర్యామ్ తో జత చేసుకునే విధంగా ఉంటుంది. ఈ ఫోన్ మెటల్ బాడీ మరియు 3D కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది.  ఈ ఫోన్ లో 50MP Eye AF డ్యూయల్ సెల్ఫీ కెమెరాని మరియు వెనుక 108MP కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్ ను వెబ్ సైట్ ద్వారా వెల్లడించి.

ఇక లీక్డ్ స్పెక్స్ విహాస్యానికి వస్తే,HDR 10+ కి సపోర్ట్ చేసే 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.56 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. ఇది Android 12 ఆధారిత FunTouch OS పై రన్ అవుతుంది. Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ 4,300mAh బ్యాటరీని 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :