వివో V21 5G స్మార్ట్ ఫోన్ ఈ రోజు ఇండియాలో విడుదలయ్యింది. 5G టెక్నాలజీ, 44MP సెల్ఫీ కెమెరాతో వంటి చాలా ఫీచర్లతో, వివో యొక్క ఈ కొత్త 5G ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ వివో స్మార్ట్ ఫోన్ OIS తో వస్తుంది కాబట్టి, మంచి డిటైల్డ్ ఫోటోలను అందించగదు. ఇది ఫోన్ కేవలం 7.29mm మందంతో చాలా సన్నగా మరియు స్టైల్ గా కనిపిస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రైస్, స్పెక్స్ లను గురించి విపులంగా తెలుసుకుందామా.
వివో V21 5G : (8జీబీ + 128 జీబీ ) : రూ.29,990
వివో V21 5G : (8జీబీ + 256 జీబీ ) : రూ.32,990
ఈ ఫోన్ మూడు ముచ్చటైన రంగుల్లో లభిస్తుంది అవి: ఆర్క్టిక్ వైట్, డస్క్ బ్లూ మరియు సన్ సెట్ డాజిల్. వివో V21 5G స్మార్ట్ ఫోన్ యొక్క Pre-Bookings ఈరోజు నుండి మొదలయ్యాయి. మే 6 న Flipakrt మరియు Vivo ఇండియా ఆన్లైన్ స్టోర్స్ నుండి దీని సేల్ మొదలవుతుంది. ఆఫ్ లైన్ చానల్స్ నుండి సేల్ కి అందుబాటులో వుంటుంది.
వివో యొక్క V21 5G స్మార్ట్ ఫోన్ పెద్ద 6.44 -అంగుళాల FHD + రిజల్యూషన్ గల E4 AMOLED డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ గల డిస్ప్లే. ఇందులో, సెల్ఫీ కెమెరా కోసం పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది. ఇందులో సూపర్ కెమెరాని అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ కేవలం 7.29mm మందంతో చాలా సన్నగా మరియు స్టైల్ గా కనిపిస్తుంది.
ఈ ఫోన్ మెడియటెక్ Dimensity 800U 5G ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 8/12GB RAM మరియు 128/256GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది Funtouch 11.1OS ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.
ఇక కెమెరాల విషయంలో, వివో V21 5G వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 64MP సెన్సార్ ని (OIS+AF) తో అందించింది. దీనికి జతగా 8MP (అల్ట్రా-వైడ్ యాంగిల్ /బొకే) కెమెరా, 2MP సూపర్ మ్యాక్రో కెమెరా లను జతచేసింది. ముందు భాగంలో, 44 MP OIS సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ప్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.