మరికొద్ది సేపట్లో మొదలుకానున్న VIVO U20 మొదటి సేల్

Updated on 28-Nov-2019
HIGHLIGHTS

గేమింగ్ కోసం అల్ట్రా గేమింగ్ మోడ్ తో మంచి గేమింగ్ అనుభవాన్ని అందుకొవచ్చు.

ఇండియాలో ఒక స్నాప్ డ్రాగన్ 675 SoC తోపాటుగా ఒక పెద్ద 5000mAh బ్యాటరీ తో కేవలం రూ .10,990 రూపాయల ప్రారంభ ధర వద్ద వివో సంస్థ, విడుదల చేసిన VIVO U10 స్మార్ట్ ఫోన్ యొక్క మొదటీ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా ద్వారా జరగనుంది.  ఈ స్మార్ట్ ఫోనులో గేమింగ్ కోసం అల్ట్రా గేమింగ్ మోడ్ తో మంచి గేమింగ్ అనుభవాన్ని అందుకొవచ్చు.

VIVO U20 :  ధర

వివో యు 20 యొక్క సాధారణ వేరియంట్ రూ .10,990 నుండి ప్రారంభమవుతుంది, ఇది 4 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో ఉంటుంది. ఇది కాకుండా, రూ .11,990 ధరతో 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ నవంబర్ 28 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది. అయితే, ఫస్ట్ సేల్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ను మొదటి సేల్ నుండి ముందస్తు చెల్లిపు చేసేవారికి, 1000 తగ్గింపు లభిస్తుంది. అధనంగా, రిలయన్స్ జియో బెనిఫిట్స్ క్రింద 6000 బెనిఫిట్స్ మరియు 6 నెలల EMI తో కొనేవారి కోసం NO Cost EMI ని ప్రకటించింది.       

VIVO U20 ప్రత్యేకతలు

ఈ వివో యు 20 ఒక పెద్ద 6.35-అంగుళాల FHD + ఐపిఎస్ డిస్ప్లే తో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ బ్లేజ్ బ్లూ మరియు రేసింగ్ బ్లాక్ వంటి రెండు మంచి కలర్ రంగులలో అందించబడుతోంది. ఇవి కాకుండా, ఒక పెద్ద 5000 mAh బ్యాటరీ కూడా ఈ ఫోనులో అందించబడింది, ఇది 18w ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ ఫోన్ ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675AIE ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు గేమింగ్ పనితీరును మెరుగుపరచడానికి, ఈ ఫోన్ అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది, అలాగే ఫోనులో డార్క్ మోడ్‌ ని కూడా అందించారు.ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారితంగా Funtouch OS 9.2 స్కిన్ పైన నడుస్తుంది.  

కెమెరా విభాగం గురించి మాట్లాడితే, ఈ ఫోన్ వెనుక భాగంలో AI ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది, దీనిలో 16 MP ప్రాధమిక కెమెరా మరియు దానికి జతగా ఒక 8 మెగాపిక్సెల్స్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు మూడవదిగా  2 MP  మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :