Vivo T5x 5G launched with stunning features under 20k in India
Vivo T5x 5G: వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వివో టి5x రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో 1 మిలియన్ AnTuTu స్కోర్ అందించే మీడియా టెక్ లేటెస్ట్ చిప్సెట్ తో లాంచ్ అయింది. ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదటి రోజు సేల్ అవుతుంది. ఈ వివో లేటెస్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి లభించే డీల్స్ మరియు ఈ ఫోన్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఈ ఫోన్ మూడు వేరియంట్స్ లో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ (6GB + 128GB) ను రూ. 18,999 ధరతో అందించింది. ఈ ఫోన్ మిడ్ వేరియంట్ (8GB + 128GB) రూ. 20,999 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ (8GB + 256GB) రూ. 22,999 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ స్టార్ సిల్వర్ మరియు సైబర్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఈ ఫోన్ పై HDFC, SBI మరియు HDFC క్రెడిట్ కార్డ్ రూ. 2,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అలాగే, ఈ ఫోన్ పై No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది.
ఈ వివో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 6.76 ఇంచ్ LCD స్క్రీన్ ఉంటుంది మరియు ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400-Turbo చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇది 1 Mn+ AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 8 జీబీ అదనపు ర్యామ్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ వివో ఫోన్ 50 MP (Sony IMX 852)మెయిన్ కెమెరా మరియు 2MP బొకే కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు AI ఫీచర్స్ కూడా కలిగి ఉంది. వివో టి5x ఫోన్ 7200 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ కలిగి ఉంటుంది.
Also Read: POCO X8 Pro: భారీ ఆఫర్స్ తో మొదలైన పోకో లేటెస్ట్ పోకో ఫోన్ సేల్.!
ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు గేమింగ్ కోసం 4D గేమ్ వైబ్రేషన్ సెటప్ కూడా కలిగి ఉంటుంది.