Vivo T4x 5G: సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ మరియు సూపర్ డిజైన్ తో వస్తుంది.!

Updated on 26-Feb-2025
HIGHLIGHTS

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ ఇప్పుడు మరింత ఆకట్టుకుంటోంది

ఫీచర్స్ తో పాటు ఫోన్ డిజైన్ తెలియచేసే ఇమేజ్ లను కూడా విడుదల చేసింది

Vivo T4x 5G బిగ్ 6500 mAh బ్యాటరీతో లాంచ్ అవుతుంది

Vivo T4x 5G: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ ఇప్పుడు మరింత ఆకట్టుకుంటోంది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ సార్ ఫోన్ కోసం కంపెనీ గొప్పగా టీజింగ్ చేస్తోంది మరియు ఫీచర్స్ తో పాటు ఫోన్ డిజైన్ తెలియచేసే ఇమేజ్ లను కూడా విడుదల చేసింది. ఈ ఇమేజ్ ల ద్వారా ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ మరియు సూపర్ డిజైన్ తో అర్ధం అవుతోంది.

Vivo T4x 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?

వివో T4x స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ యొక్క టీజింగ్ స్పీడ్ పెంచింది కాబట్టి ఈ ఫోన్ లాంచ్ కూడా త్వరలోనే ఉంటుంది. ఈ ఫోన్ కోసం Flipkart సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.

Also Read: Poco M7 5G: 12GB ర్యామ్ మరియు స్నాప్ డ్రాగన్ కొత్త చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది.!

Vivo T4x 5G : ఫీచర్స్

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ మరియు డిజైన్ వివరాలు ఇప్పుడు వివో బయటపెట్టింది. ఈ ఫోన్ ను ఇప్పటి వరకు T సిరీస్ లో చూడని సరికొత్త డిజైన్ తో అందిస్తోంది. ఈ ఫోన్ పెద్ద కెమెరా బంప్ మరియు ప్రీమియం డిజైన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా మరియు రింగ్ లైట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందుగా అందించిన ఫోన్స్ కలిగిన పెద్ద రింగ్ కెమెరా బంప్ డిజైన్ ను దాటవేసింది.

ఇక ఈ సిరీస్ ఫోన్స్ నినాదమైన Get.Set.Turbo ఫీచర్స్ తో ఈ ఫోన్ కూడా వస్తోంది. ఈ ఫోన్ లో 6500 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ మంచి డ్యూరబిలిటీ కూడా కలిగి ఉంటుందట. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా వివో త్వరలోనే అందిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :