vivo T4R launch date and first look revealed
vivo T4R :వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో టి4ఆర్ లాంచ్ కోసం ‘కమింగ్ సూన్’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేప్పట్టిన వివో, ఈరోజు ఈ ఫోన్ ఫస్ట్ లుక్ మరియు లాంచ్ డేట్ రివీల్ చేసింది. ఈ ఫోన్ ను వివో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన T సిరీస్ నుంచి అందిస్తుంది మరియు ఈ ఫోన్ కూడా అదే ‘గెట్ సెట్ టర్బో’ నినాదంతో వస్తోంది.
వివో టి4 ఆర్ స్మార్ట్ ఫోన్ ను జులై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ కూడా అందించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ ఫస్ట్ లుక్ కూడా వివో విడుదల చేసింది.
వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఈ ఫోన్ ముందుగా వచ్చిన స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, ఈ ఫోన్ కొత్త కలర్స్ తో కొత్త లుక్ తో ఉన్నట్లు గమనించవచ్చు. వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్ వెనుక దూల రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో కూడా ఆరా లైట్ అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ సెటప్ కలిగిన క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే తో ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక కర్వుడ్ గ్లాస్ తో గ్లాసీ బ్యాక్ డిజైన్ తో వస్తుంది.
Also Read: iQOO Z10R: స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్లు ఆన్లైన్ లో దర్శనమిచ్చాయి. ఆన్లైన్ లో ఈ ఫోన్ గురించి చక్కర్లు కొడుతున్న రూమర్లు మరియు అంచనా ఫీచర్స్ పరిగణలోకి తీసుకుంటే, వివో టి4ఆర్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ 4K వీడియో రికార్డ్ సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో పెద్ద బ్యాటరీ కలిగి ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ కూడా ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న IP 69 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఫోన్ కీలక ఫీచర్లు మరియు స్పెక్స్ కూడా వివో ముందే వెల్లడించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందు వస్తాం.