Vivo T4 Pro 5G టాప్ ఫీచర్ విడుదల చేసిన వివో.!

Updated on 21-Aug-2025
HIGHLIGHTS

నిన్న Vivo T4 Pro 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వివో

ఈరోజు ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్ కూడా విడుదల చేసింది

వివో టి 4 సిరీస్ లో టాప్ లైనప్ గా వస్తున్న ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది

నిన్న Vivo T4 Pro 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వివో, ఈరోజు ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్ కూడా విడుదల చేసింది. వివో టి 4 సిరీస్ లో టాప్ లైనప్ గా వస్తున్న ఈ ఫోన్ భారీ ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. ఈరోజు వివో వెల్లడించిన టాప్ ఫీచర్ ద్వారా ఈ విషయం అర్ధం అవుతుంది. మరి వివో ఈరోజు విడుదల చేసిన ఆ టాప్ ఫీచర్లు ఏమిటో మరియు ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ ఏమిటో కూడా తెలుసుకుందాం.

Vivo T4 Pro 5G టాప్ ఫీచర్స్ ఏమిటి?

వివో టి 4 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క ప్రోసెసర్ గురించి ఈరోజు వివో వివరాలు బయటకు వెల్లడించింది. క్వాల్కమ్ లేటెస్ట్ గా విడుదల చేసిన మిడ్ రేంజ్ ప్రోసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు వివో ప్రకటించింది. అదేనండి, క్వాల్కమ్ యొక్క Snapdragon 7 Gen 4 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని తెలిపింది. ఈ ప్రోసెసర్ 10,00,000 కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే ప్రోసెసర్ మరియు ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా వివో టీజింగ్ ద్వారా తెలియజేసింది.

ఈ ఫోన్ యొక్క కెమెరా గురించి కంపెనీ ముందునుండే టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లో 3x పెరిస్కోప్ ఉన్నట్లు వివో మొదటి నుంచి చెబుతోంది. ఇక ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్టు కూడా చూపించింది. ఈ ఫోన్ గోల్డ్ మరియు బ్లూ రెండు రంగుల్లో లాంచ్ అవుతుందని టీజర్ ఇమేజ్ ద్వారా తెలిపింది. వాస్తవానికి, ఈ ఫోన్ గురించి ముందుగా ఊహించి చెప్పిన వాటిలో చిప్ సెట్ మాట నిజం అయ్యింది.

Also Read: అండర్ రూ. 20,000 ధరలో లభించే బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv పై ఒక లుక్కేద్దామా.!

Vivo T4 Pro 5G అంచనా స్పెసిఫికేషన్స్ ఏమిటి?

వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ పెద్ద 6.78 ఇంచెస్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుందని అంచనా. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50MP Sony మైన కెమెరా, 3x పెరిస్కోప్ కెమెరా జతగా మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందని కూడా రూమర్ ఉంది. ఈ ఫోన్ 6500 mAh బోగ్ బ్యాటరీ మరియు దానికి తగిన 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉండవచ్చని చెబుతున్నారు.

ఈ ఫోన్ ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో విడుదల అవుతుంది మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :