vivo t4 lite 5g launch price and specs india
vivo T4 Lite 5G : ఈరోజు వివో ఇండియాలో అతి చవక ధరలో 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పటి వరకు వివో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫోన్ అత్యంత చవకైన ఫోనుగా నిలిచింది. అదే, వివో టి 4 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కేవలం 10 వేల రూపాయల బడ్జెట్ ధరలో స్టన్నింగ్ స్పెక్స్ షీట్ తో లాంచ్ అయ్యింది.
వివో ఈ ఫోన్ కేవలం రూ. 9,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 4GB + 128GB వేరియంట్ ఈ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 10,999 ధరతో మరియు హై ఎండ్ 8GB + 256GB వేరియంట్ ను కూడా కేవలం రూ. 12,999 రూపాయల ధరతో లాంచ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
వివో ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 500 రూపాయల ఇన్స్టాంట్ డిస్కౌంట్ అఫర్ అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొనేవారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు వివో అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
వివో ఈ స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD ప్లస్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 1000 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimesnsity 6300 5జి చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8 GB ర్యామ్ మరియు 256GB హెవీ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 50MP Sony AI మెయిన్ సెన్సార్ మరియు 2MP బొకే సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ చాలా వివో కెమెరా ఫిల్టర్స్ తో పాటు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ మరియు IP 64 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ భారీ 6000 mAh బ్యాటరీ మరియు 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: అండర్ రూ. 5,000 బడ్జెట్ ధరలో బెస్ట్ Dolby Soundbar కోసం చూస్తున్నారా.!
ఈ ఫోన్ Funtouch OS 15 సాఫ్ట్ వేర్ తో Android 15 OS తో వస్తుంది. ఈ ఫోన్ ను ప్రిజం బ్లూ మరియు టైటానియం గోల్డ్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ మరియు లైట్ వెయిట్ తో ఆకట్టుకుంటుంది.