Vivo T3 Pro 5G with stunning features launching tomorrow
Vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం ఇండియాలో విడుదల కావడానికి సిద్ధం అవుతోంది. ఈ ఫోన్ ను స్టన్నింగ్ ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. అంతేకాదు, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో గొప్ప గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందించే ఫోన్ అని కూడా వివో గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తెలుసుకోండి.
వివో టి3 స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది 820K+ పైగా AnTuTu స్కోర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని వివో తెలిపింది. ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో వస్తుంది మరియు ప్రీమియం లెథర్ బ్యాక్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను 5500 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో అందిస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ ను కూడా లాంచ్ కంటే ముందే బయటపెట్టింది.
వివో టి3 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను OIS సపోర్టెడ్ 50MP Sony IMX 882 సెన్సార్ మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో అందిస్తుందిట. దీనితో పాటు ఈ ఫోన్ లో Aura Ring సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ సాండ్ స్టోన్ ఆరంజ్ కలర్ లో చూడచక్కగా కనిపిస్తోంది.
Also Read: లేటెస్ట్ LG Smart Tv మంచి డిస్కౌంట్ తో రూ. 11,999 ధరకే ఈరోజు లభిస్తోంది.!
సింపుల్ గా చెప్పాలంటే, చాలా స్లీక్ డిజైన్ తో Sony పవర్ ఫుల్ కెమెరా కలిగిన కర్వుడ్ డిస్ప్లే ఫోన్ గా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను వివో తీసుకు వస్తోంది. ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల అవుతుంది. రేపు ఈ ఫోన్ యొక్క ప్రైస్, స్పెక్స్ మరియు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం.